మైలు రాళ్లకు భిన్నమైన రంగులను పై భాగంలో ఎందుకు వేస్తారో తెలుసా..?అదే ఇప్పుడు తెలుసుకుందాం.
మైలు రాళ్ల పై భాగంలో పసుపు రంగు ఉంటే మనం జాతీయ రహదారిపై ప్రయాణిస్తున్నామని తెలుసుకోవాలి. మన దేశంలో కేవలం కొన్ని మాత్రమే జాతీయ రహదారులు ఉంటాయి. వాటిపై ఉండే మైలు రాళ్లకు పై భాగంలో ఇలా పసుపు రంగులో పెయింట్ వేస్తారు. దీంతో అవి జాతీయ రహదారులు అని తెలుస్తాయి.
మైలు రాళ్ల పైభాగంలో ఆకుపచ్చ రంగు ఉంటే అవి స్టేట్ హైవేలు అని తెలుసుకోవాలి. వాటిని ఆయా రాష్ట్ర ప్రభుత్వాలే వేస్తాయి. వాటి పర్యవేక్షణను రాష్ట్ర ప్రభుత్వాలే చూసుకుంటాయి.
మైలు రాళ్ల పై భాగంలో తెలుపు లేదా నలుపు రంగు ఉంటే మనం ప్రయాణిస్తున్నది పెద్ద నగరం లేదా జిల్లా అని తెలుసుకోవాలి. ఇలాంటి రహదారులను ఆ నగర లేదా జిల్లా అభివృద్ధి శాఖే పర్యవేక్షిస్తుంది.
ఇక మైలు రాళ్ల పైభాగంలో ఆరెంజ్ లేదా ఎరుపు రంగు పెయింట్ వేసి ఉంటే మనం గ్రామంలో ఉన్నామని తెలుసుకోవాలి.అలాగే ఈ రోడ్లను ప్రధాన్ మంత్రి గ్రామ్ సడక్ యోజన కింద నిర్మించారని అర్థం చేసుకోవాలి.
సుబ్బారావు గాలంకి
8801393100