ధరణితో రైతులకు ఇబ్బందులు

బీజేపీ కిసాన్ మోర్చా ధర్నా

బీజేపీ కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో ధరణి పోర్టల్ ద్వారా తెలంగాణ రాష్ట్ర రైతాంగం అనేక సమస్యలు ఎదుర్కొంటున్నది అన్యాయానికి గురవుతున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా టిఆర్ఎస్ పార్టీ లక్ష రూపాయల లోపు రుణాలను మాఫీ చేస్తామని హామీ ఇచ్చి నాలుగు సంవత్సరాలు గడుస్తున్న నెరవేర్చకపోవడం, పంటల బీమా పథకం అమలు చేయకపోవడం నిరసిస్తూ నేడు అసెంబ్లీ వద్ద నిరసన కార్యక్రమం చేపట్టడానికి బయలుదేరిన బిజెపి కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు కొండపల్లి శ్రీధర్ రెడ్డి తో పాటు కిసాన్ మోర్చా నాయకులు మరియు రైతులను పోలీస్ అరెస్ట్ చేయడం పట్ల బిజెపి కిసాన్ మోర్చా రాష్ట్ర ఇంచార్జ్ బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి తీవ్రంగా ఖండించారు.