Suryaa.co.in

Andhra Pradesh

డర్టీ బాబు.. టిష్యూ మేనిఫెస్టో..!

-టీడీపీ మేనిఫెస్టో…టిష్యూ పేపర్ తో సమానంః మంత్రి జోగి రమేష్
– ప్రెస్ మీట్ లో టీడీపీ మేనిఫెస్టోను చించి చెత్తబుట్టలో పడేసిన మంత్రి జోగి రమేష్
– పట్టుమని పది వాగ్ధానాలూ నెరవేర్చని డర్టీ ఫెలో బాబు
– ఆల్‌ ఫ్రీ బాబు కాస్తా ఆల్‌ కాపీ బాబు అయ్యాడు
– మేనిఫెస్టో జగన్‌ కి ఒక పవిత్ర గ్రంథం
– చంద్రబాబు మేనిఫెస్టో చెత్తబుట్టకే పరిమితం
– ఇచ్చిన మాట కోసం ఎందాకైనా పోరాడే వ్యక్తి వైఎస్‌ జగన్‌
– 98.5 శాతం మేనిఫెస్టోను 4 ఏళ్ళలోనే నెరవేర్చిన నాయకుడు జగన్‌
– మా హయాంలో ప్రతి ఊర్లో అభివృద్ధి.. ప్రతి గడపలో సంక్షేమం
– చంద్రబాబూ..నీకు దమ్ము, ధైర్యం ఉంటే మేనిఫెస్టోలపై చర్చకు సిద్ధమా..?
– బీసీల భక్షకుడు చంద్రబాబు..బీసీల ఆత్మగౌరవం జగనన్న
– 25 మంత్రి పదవుల్లో 17 బడుగు బలహీనవర్గాలకే ఇచ్చిన నేత వైఎస్‌ జగన్‌
– బీసీలకు ఒక్క రాజ్యసభ సీటన్నా ఇచ్చావా బాబూ..?
– ఒంటరిగా మాపై పోటీ చేయగల సత్తా నీకుందా చంద్రబాబూ..?
– పిరికిపందవి..నువ్వు జగన్‌గారిని ఓడిస్తావా..?
– చంద్రబాబు పొత్తులతో పొర్లాడటం తప్ప చేసేదేమీ లేదు
– మీరంతా కట్టకట్టుకుని వచ్చినా మమ్మల్ని ఏమీ చేయలేరు
– జగన్‌ సింహంలా సింగిల్‌గానే వస్తాడు
రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్‌

పట్టుమని పది వాగ్ధానాలనూ నెరవేర్చని డర్టీ ఫెలో చంద్రబాబు:
– మహానాడులో డర్టీ బాబు–టిష్యూ మేనిఫెస్టో విడుదల చేశాడు. అందుకే టీడీపీ మేనిఫెస్టోను చించి చెత్తబుట్టలో వేస్తున్నాను.
– 40 ఏళ్ల రాజకీయ అనుభవం, 14 ఏళ్ల ముఖ్యమంత్రిని అని చెప్పుకునే చంద్రబాబు 2014 మేనిఫెస్టోలో 650 వాగ్ధానాలు ఇచ్చాడు.
-ఇది చంద్రబాబు మేనిఫెస్టో. ఇందులో ఏ ఒక్కటీ నెరవేర్చని వాగ్ధానాలను చించి ముక్కలు చేసి డస్ట్‌ బిన్‌లో పడేస్తున్నాను.
– 650 వాగ్ధానాలు చేసిన వ్యక్తి వాటిలో పట్టుమని పది వాగ్ధానాలను కూడా నెరవేర్చని డర్టీ ఫెలో చంద్రబాబు.
– 2014–19 మధ్య 5 ఏళ్ల పాటు పరిపాలన వెలగబెట్టిన చంద్రబాబు తన మేనిఫెస్టోని చెత్తబుట్టలో పడేశాడు.
– ఈ సిగ్గులేని ఆల్‌ ఫ్రీ బాబు..1995, 1999, 2004 ఎన్నికల్లో కూడా ఇదే విధంగా అబద్దపు హామీలు ఇచ్చాడు.

ఆల్‌ ఫ్రీ బాబు కాస్తా..కాపీ బాబు అయ్యాడు:
– ఆల్‌ ఫ్రీ బాబు అనుకునే వాళ్లం..ఇప్పుడు కాపీ కొట్టి నకిలీ బాబు అయ్యాడు.
– అసలు చంద్రబాబు పార్టీనే నకిలీది.. స్వర్గీయ ఎన్టీఆర్ దగ్గర పార్టీని, గుర్తును కూడా కొట్టేశాడు.
– చంద్రబాబు మేనిఫెస్టో కూడా నకిలీదే…అది కూడా కొట్టేసిందే.
– చంద్రబాబూ..నీకు, దమ్ము, ధైర్యం ఉంటే నీ మేనిఫెస్టో, మా 2019 మేనిఫెస్టోపై చర్చకు సిద్ధమా..?
– మా ముఖ్యమంత్రి నాలుగేళ్లలో 98.5 శాతం చెప్పిన ప్రతి వాగ్ధానాన్ని నెరవేర్చిన చరిత్రకారుడు జగన్‌గారు.
– నువ్వూ, నీ తాబేదార్లు చర్చకు రాలేరులే. నీకు ఆ దమ్ములేదులే చంద్రబాబూ…
– మా నాయకుడు వైఎస్‌ జగన్‌ మా మేనిఫెస్టోని బైబిల్, ఖురాన్, భగవద్గీతలా ఒక పవిత్ర గ్రంథంలా భావిస్తారు.
– ప్రమాణ స్వీకారం చేసిన మరుక్షణం నుంచి ఇచ్చిన మాటను నిలబెట్టుకోడానికి తాపత్రయ పడ్డ ముఖ్యమంత్రిని ఇప్పుడు చూస్తున్నాం.
– మేనిఫెస్టోను చెత్తబుట్టలో పడేసిన పనికిమాలిన వ్యక్తి చంద్రబాబు.

14 ఏళ్లలో నువ్వు చేయలేనిది 4 ఏళ్లలో చేసి చూపించాం:
– తల్లికి వందనం అట..ఆల్‌ రెడీ ప్రతి ఒక్కరికీ అమ్మ ఒడి చేరువు చేస్తున్నాం..
– ఇప్పుడిచ్చిన మేనిఫెస్టోను కూడా చించి ఎక్కడ పెట్టుకుంటావో పెట్టుకో.
– నాలుగేళ్ల కాల వ్యవధిలో 14 ఏళ్లలో నువ్వు చేయలేని కార్యక్రమాలను చేసి చూపించాం.
– 75 ఏళ్ల స్వాతంత్య్ర భారతదేశ చరిత్రలో ఏపీలో రూ.2.11 లక్షల కోట్లను డీబీటీ ద్వారా అక్కచెల్లెమ్మల ఖాతాల్లోకి చేరవేసిన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌.
– ప్రతి గ్రామం వెళ్లి చూడు..సచివాలయం కనిపిస్తోంది..రైతు భరోసా, ఆస్పత్రి ఇలాంటివి ఎన్నో కనిపిస్తాయి.
– ప్రతి గడపకూ సంక్షేమం..అమ్మ ఒడి, ఆసరా, చేయూత, కాపు నేస్తం, రైతు భరోసా లాంటివి ఎన్నో కనిపిస్తాయి.
– ప్రతి ఊర్లో అభివృద్ధి..ప్రతి గడపలో సంక్షేమం కనిపిస్తుంది.
– కేవలం నాలుగేళ్ల కాల వ్యవధిలో జగన్‌ సారథ్యంలో ఇది సాధ్యమైంది.
– ఏ ముఖ్యమంత్రి అయినా ఇదంతా చేయగలడా..? దేశంలోని పలువురు ముఖ్యమంత్రులు జగన్‌గారి సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను చూసి శెభాష్ అంటున్నారు.
– మేం గర్వంగా, ధైర్యంగా చెప్తున్నాం..ఒక పక్క పోర్టులు, మరో పక్క హార్బర్ల నిర్మాణం చేస్తున్నాం.
– మెడికల్‌ కళాశాలలు, స్టేట్‌ హైవేస్, నేషనల్‌ హైవేస్‌…ఇవన్నీ నాలుగేళ్ల కాలంలోనే చేపట్టాం.

పిరికిపంద చంద్రబాబు జగన్‌ ని ఓడిస్తాడా..?:
– చంద్రబాబుకు జగన్‌ గురించి మాట్లాడే అర్హతే లేదు.
– నీ అంతట నువ్వు నిలబడి ఒక్కడిగా మాపై పోటీ చేయగల సామర్థ్యం నీకుందా..?
– పిరికిపంద అయిన చంద్రబాబు.. జగన్‌గారిని ఓడిస్తాడా..?
– నువ్వు పొత్తులతో పొర్లాడటం తప్ప చేసేదేమీ లేదు.
– మీరంతా కలిసి వచ్చి ఏం చేయగలరు..?
– ఒక వీరుడు, ధీరుడు, ధీశాలి సింహంలా సింగిల్‌గానే వస్తాడు.
– 2019 ఎన్నికల్లో చంద్రబాబు ఏ విధంగా అట్టర్‌ ప్లాప్‌ అయ్యాడో ఈ ఆల్‌ కాపీ బాబు 2024 ఎన్నికల్లో అడ్రస్‌ గల్లంతు ఖాయం.
– వచ్చే మహానాడు నాటికి చంద్రబాబు టీడీపీకి రాజకీయంగా పాడెకట్టి, పిండం పెడతారు.
– బంగాళాఖాతంలో టీడీపీని కలిపేసి, హైదరాబాద్, సింగపూర్, అండమాన్‌ లాంటి చోటికి చంద్రబాబు వెళ్లిపోవడమే ఇక మిగిలివుంది.
– పిట్టల దొరలా నీ వేషాలు, చేష్టలు చూసి ప్రజలు నవ్వుకుంటున్నారు.

అన్నీ ఇచ్చి ఉంటే నీ దీపం ఎందుకు ఆర్పేస్తారు బాబూ..?:
– నీ 14 ఏళ్ళ చరిత్రలో నిరుద్యోగభృతి ఇవ్వకుండా ఏం పీకావ్‌ చంద్రబాబూ..?
– ఇప్పుడు వెళ్లండి నిరుద్యోగులంతా నిన్ను, నీ కొడుకును చెంపలు పగలగొడతారు.
– దీపం పథకం కూడా అంతే..అప్పుడిస్తే నీ దీపం ఎందుకు ఆర్పేశారు..?
– ఉచిత బస్సు ప్రయాణం పథకాన్ని నీ 14 ఏళ్లలో ఎందుకు చేయలేదు.
– ఇప్పుడొచ్చి చంద్రబాబు ప్రతి రైతుకు రూ.20 వేలు ఇస్తాడట..
– దుర్మార్గుడైన చంద్రబాబు .. బ్యాంకుల్లో కుదవపెట్టిన మహిళల బంగారం ఇంటికి రావాలంటే బాబు రావాలి అన్నాడు.
– దాన్ని నెరవేర్చకుండా రైతులందర్నీ మోసం చేసినందుకే 23 సీట్లకే పరిమితం చేశారు.

బీసీల భక్షకుడు చంద్రబాబు..బీసీల ఆత్మగౌరవం వైఎస్‌ జగన్‌:
– ఈరోజు వచ్చి బీసీలకు రక్షణ కవచం అంటాడు..బీసీలను భక్షించిందే నువ్వు కదా..?
– బీసీల ఓట్లేయించుకుని, బీసీలే నా అండ, దండ అన్నాడు..బీసీలందర్నీ తొక్కి నారతీశాడు.
– మా బీసీలకు ఒక్కరికైనా రాజ్యసభ సీటిచ్చావా..?
– ఏపీ క్యాబినెట్‌లో 25 మంత్రి పదవులు ఉంటే 17 మంది బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు అందించిన మనసున్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌.
– బీసీల ఆత్మగౌరవం జగనన్న. వారే చంద్రబాబును తాటతీసి తరిమి కొడతారు.
– ఇంటింటికి మంచినీరు మేమిస్తున్నాం ఇప్పుడు..నువ్వున్నప్పుడు ఎందుకు ఇవ్వలేకపోయావ్‌.
– పేదల రక్తం పీల్చిన చంద్రబాబు, అమరావతిలో 50 వేల మంది పేదలకి ఇళ్ల స్థలాలు ఇస్తుంటే..సామాజిక సమతుల్యత దెబ్బతింటుందని మాట్లాడి, ఇప్పుడు పేదలను ధనవంతులను చేస్తానంటే నమ్ముతారా…?
– అందుకే పేదలు సుప్రీం కోర్టు వరకూ వెళ్లి పెత్తందార్ల తాటతీశారు.

ఇచ్చిన మాటకోసం ఎందాకైనా పోరాడే వ్యక్తి జగన్‌:
– మేనిఫెస్టో అంటే గౌరవం, బాధ్యత, విలువ, విశ్వనీయత ఉండాలి.
– ఒక లీడర్‌ ఒక మాట చెప్తే ఆ మాట కోసం ఎందాకైనా సరే పోరాడే శక్తి ఉండాలి.
– మాట చెప్పడం..మడిచి పక్కన పడేయడం చంద్రబాబు నైజం.
– మా లీడర్‌ ఒక్క మాట చెప్పాడంటే ఆ మాట కోసం ఎందాకైనా పోరాడే శక్తి జగన్‌గారి వద్ద ఉంది.
– పేదలను నిలబెట్టగల సత్తా, సంపన్నులను చేయగల వ్యక్తిత్వం జగన్‌ ది.
– ప్రతి గడపకు సంక్షేమం, ప్రతి గ్రామంలో అభివృద్ధి జరుగుతుంటే తట్టుకోలేని పెత్తందార్లు రాజమండ్రిలో పోగయ్యారు.
– మహానాడుకు మేం ఆటంకాలు కలుగజేయలేదు…గాలి, వాన, దుమ్ము వచ్చి మీరే కొట్టుకుపోయారు.
– అక్కడ 15 వేల మంది లేరు..15 లక్షలు అంటారు.
– దీనికే జగన్‌ జనాన్ని రానివ్వలేదంటారు..మేమన్నా వర్షాన్ని పంపించామా..?
– దుర్మార్గమైన చంద్రబాబు మాటలు ప్రజలు వినరు, నమ్మరు.
– ఇతను ఆల్‌ ఫ్రీ బాబు అని అందరికీ తెలసు..ఇప్పుడు ఆల్‌ కాపీ బాబుగా మారిపోయాడు.
– చించి పడేసిన టీడీపీ మేనిఫెస్టో చెత్తబుట్టతో సహా చంద్రబాబుకు పార్శిల్‌ పంపిస్తున్నా…
– మొన్న కరకట్ట వద్దకు వెళ్లా..కలవనివ్వలేదు..ఈ సారి కూడా కరకట్టకు పంపిస్తా.
– జగన్‌ గురించి తెలిసిన 5 కోట్ల మంది రాష్ట్ర ప్రజలు జయహో వైఎస్ఆర్సీపీ అంటున్నారు.
– కష్టాలు..ఇబ్బందులున్నా మనల్ని నిలబెడుతున్నాడని ఆయనపై ప్రజలకు నమ్మకం ఉంది.

LEAVE A RESPONSE