– రాజకీయ గురువును నేరుగా ఇంటికి వెళ్ళి కలిసి పాదాభివందనం చేసిన మంత్రి జోగి రమేష్
అందరూ వచ్చి ఆయనను కలుస్తుంటే..ఈయన వెళ్లి ఆయన దగ్గర సాగిల పడ్డారు . కృషాజిల్లా రాజకీయం లో ఒక అరుదైన దృశ్యం ఆవిష్కృతం అయ్యింది..
రాజకీయాలలో సహజంగా అధికార పార్టీ అమాత్యులను ప్రసన్నం చేసుకోవడానికి నేతలు, వ్యాపార వేత్తలు కలిసి అభినందించడం చూస్తుంటాం.. అంతెందుకు ఆయా నియోజకవర్గ ఎమ్మెల్యే లు సైతం మంత్రి వర్యులను మర్యాద పూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలుపుతూ ఉంటారు..
. అయితే ఇదంతా రాజకీయాల్లో సర్వ సాధారణంగా జరుగుతుంటాయి.. కానీ కృషాజిల్లా రాజకీయం లో మాత్రం అందుకు భిన్నంగా జరిగింది.. రాష్ట్ర తాజా మంత్రి జోగి రమేష్ ఆదర్శ రాజకీయాలకు నాంది పలికారు..మంత్రి హోదా లో ఉన్నప్పటికీ జగ్గయ్యపేట ఎమ్మెల్యే సామినేని ఉదయభాను ఇంటికి స్వయంగా వెళ్లి కలిసి ఉదయభాను దంపతులకు పాదాభివందనం చేసి అందరిని ఆశ్చర్యానికి గురి చేశారు..
ఈ సందర్భంగా రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ మీడియాతో మాట్లాడుతూ తన రాజకీయ భవిష్యత్తుకు ఎమ్మెల్యే ఉదయభాను గాడ్ ఫాదర్ లాంటి వారంటూ వాఖ్యానించారు.. తాను మంత్రి అయినప్పటికీ తనకి ఎప్పటికీ ఆయన గురువేనని తాను ఆయన శిష్యుడునే అంటూ గురుభక్తి చాటుకున్నారు. అయితే వర్తమాన రాజకీయాలకు ఇదంతా భిన్నంగా ఉన్నప్పటికీ మంత్రి హోదా ఉండి ఒక ఎమ్మెల్యే కు మంత్రి జోగి రమేష్ పాదాభివందనం చేయడం జిల్లా వాసులను ఆశ్చర్యానికి గురిచేసింది.
మంత్రి హోదా పక్కన పెట్టి రాజకీయ గురువును గౌరవించడం పట్ల మంత్రి జోగి రమేష్ పై విమర్శల తో పాటు ప్రశంసలు వినిపిస్తున్నాయి.. ఎమ్మెల్యే ఉదయభాను దంపతులకు జోగి రమేష్ పాదాభివందనం చేసిన ఫోటో లు ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా చక్కర్లు కొడుతున్నాయి… ఫోటో చూసిన నెటిజన్లు మంత్రి జోగి రమేష్ గ్రేట్ అంటూ కామెంట్ చేస్తున్నారు.