Suryaa.co.in

Andhra Pradesh

విద్యుత్ డిమాండ్ తట్టుకునేలా డిస్కంలు పని చేస్తున్నాయి

-ఏపీ ట్రాన్స్ కో
అమరావతి : ఏపీలో విద్యుత్ డిమాండ్ తట్టుకునేలా డిస్కంలు పని చేస్తున్నాయని ఏపీ ట్రాన్స్ కో తెలిపింది. బొగ్గు కొరత కారణంగా ఏపీలో 2500 మెగావాట్లు మాత్రమే ఏపీ జెన్కో ప్లాంట్లు ఉత్పత్తి చేయగలుగుతున్నాయని ఏపీ ట్రాన్స్ కో తెలిపింది. ఏపీ థర్మల్ విద్యుత్ కేంద్రాలకు రోజుకు 70 వేల టన్నుల బొగ్గు అవసరమని, కొరత కారణంగా సెప్టెంబరు నెలలో 24 వేల టన్నులు మాత్రమే సరఫరా చేస్తున్నామని ఏపీ ట్రాన్స్ కో అధికారులు తెలిపారు. బొగ్గు కొరతతో తక్కువ స్థాయిలో విద్యుత్ అంతరాయాలతో సరఫరా చేయగలుగుతున్నామని చెప్పారు. బేస్ లోడుకు సరిపడ విద్యుత్ ఉత్పత్తి కావటం లేదని, 908 గ్యాస్ ఆధారిత ప్లాంట్ల నుంచి 100 మెగావాట్లు మాత్రమే వస్తుందని అధికారులు పేర్కొన్నారు. ప్రస్తుతం ఏపీలో 185 మిలియన్ యూనిట్ల విద్యుత్ డిమాండ్ ఉందని అధికారుల తెలిపారు. పీక్ డిమాండ్ మేరకు 9064 మెగావాట్ల విద్యుత్ అవసరం అవుతోందని ఏపీ ట్రాన్స్ కో అధికారులు చెప్పారు.

LEAVE A RESPONSE