Home » మోడీ సారూ..ఎప్పుడు నేర్చుకుంటావు బాసు!

మోడీ సారూ..ఎప్పుడు నేర్చుకుంటావు బాసు!

మాకెందుకు బాబూ defence ఖర్చులు. ఇంతకు ముందు ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వాలు ఏమైనా ఇలా ఖర్చు పెట్టాయా? లేదే. ఏమవుతుంది మహా అయితే చైనావాడు ఇంకాస్త కోస్తాడు. కాశ్మీర్ లో ఒక వెయ్యో రెండువేలు ఎక్కువ చస్తారు. చచ్చేది మా హిందువులే కదా, కాంగ్రెస్ మిత్రులు కాదు కదా. పర్వాలేదు, మాకు సహనం ఎక్కువ. 70 సంవత్సరాలలో లక్షల్లో చచ్చాం.‌ ఏమన్నా బాధపడ్డామా, లేదే. ఏ అమెరికాకో, UNO కో ఫిర్యాదు చేసి ఊరుకోవచ్చుగా. పెద్ద పోటుగాడు లాగా వాళ్ళని తరిమి తరిమి కొడుతున్నావ్. అహా, దానివల్ల మాకేమిటి అంట?మోడీ సారూ.. ఎప్పుడు నేర్చుకుంటావు బాసు?
ఇంతకుముందు మహమ్మార్లు రాలే? వచ్చాయి కదా. అప్పటి ప్రభుత్వాలేమన్నా ప్రజలు కొసం ఇంత ఆదుర్దా పడ్డారా, పెద్ద ఎగేసుకుని ప్రపంచం మొత్తం కలిసి చేయనంత గుండిగలు గుండిగలు vaccine తయారుచేసేసి ఇప్పటికి ఓ 90 కోట్లమందికి వేసిపడేసావ్. ప్రపంచం మొత్తం నీకు సాష్టాంగ నమస్కారం చేయొచ్చు. మేము చేయముగా.‌ కొన్నేళ్లు ఆగి ఆ డబ్బులేవో ఏ అమెరికా వాడికో, రష్యావాడికో ఇచ్చేసి, అలవాటు ప్రకారం‌ దేహీ అంటే outdated vaccine ఏదో మన మెహాన్ని కొట్టావారూ, ఆహా, ఓహో అని మేమంతా మిమ్మల్ని ఆకాశానికెత్తేవారం, ఇంకో పదేళ్ళు మీకు అధికారం గ్యారెంటీగా ఉండేది. మీకు స్విస్ బ్యాంక్ అకౌంట్లు కూడా వచ్చేవి.మోడీ సారూ.. ఎప్పుడు నేర్చుకుంటావు బాసు?
పాపం వలస కార్మికులు, ఈ మహమ్మారి సమయంలో ఆదాయం లేక ఏం ఇబ్బంది పడిపోతారో అని, మధ్య దళారీల(70 ఏళ్ళ సాంప్రదాయానికి విరుద్ధంగా దళారీల నోట మట్టికొట్టడం అన్యాయం కాదూ) ద్వారా అయితే కోతలు, చిలక్కొటుడులు ఎక్కువ ఉంటాయని బ్యాంకుల వాళ్ళని ఇబ్బంది పెట్టి, ఓపెన్ చేసిన జన్ ధన్ ఖాతాల్లో లక్షల కోట్లు దిమ్మరించేసావు. ఈ దేశంలో ప్రభుత్వాలు ఎప్పుడైనా వాళ్ళని పట్టించుకుకొన్నాయా, కాసిని కోట్లు చల్లేసి మీడియా నోరు నొక్కేసి ప్రపంచం కళ్ళు మూసేస్తే పోయేదానికి అంత ఖర్చు పెట్టేసావ్. శవాల కోసం ఎదురు చూసే రాబందులు ఏం పాపం చేసాయని వాళ్ళ ఉసురు పోసుకొంటున్నావ్?మోడీ సారూ.. ఎప్పుడు నేర్చుకుంటావు బాసు?
పక్క దేశాలన్నీ తిండిలేక చచ్చిపోతుంటే, ఎప్పుడూ లేనంత ధాన్యం పండించేసి ఆయాసపడుతూ, రైతులింట ఆనందాలు పండించే బిల్లులు తెచ్చేసి ఖలిస్తాన్ల కంట్లో కారం కొట్టేసావ్ ఏం ఉద్దరిద్దామని?మోడీ సారూ.. ఎప్పుడు నేర్చుకుంటావు బాసు?
నేర్చుకో సారు అప్పు చేసో, దొంగనోట్లు ముద్రించో, (… పాపం నోట్లు రద్దు చేసి వాళ్ళందరినీ నట్టేట ముంచేశావు…), దేశాన్ని తాకట్టు పెట్టో ఆ పెట్రోలేదో అయిదో పదో తగ్గించేసి, బుక్ చేసిన నెలకో రెన్నెల్లకో వచ్చినా పర్లేదు ఆ గ్యాసేదో పదో పరకో తగ్గించేసావనుకో , అబ్బా మా సారెంత గొప్పవాడో అనుకొని ఇంట్లో , వీధిలో నీ శిలా విగ్రహాలు పెట్టేసి చరిత్ర మొత్తం నువ్వే అనేసి తెగ రాతలు రాయించేసేవాళ్ళం. అది మాకేమైనా కొత్తా ? గాంధీ, నెహ్రూలతో సహా కాంగ్రెస్ వాడు ఒక్కడూ చావకపోయినా , అన్ని వేల మంది బలిదానాలు పక్కన పడేసి …అసలు తెచ్చిన వాళ్ళందరూ పుట్టకొకడు, గట్టుకొకడూ కొట్టుకుపోయినా మర్చిపోయి స్వాతంత్ర్యం తెచ్చింది గా-నే-లే అనలా. పప్పూల్ని, ఖైదీలను గెలిపించుకోవట్లే. అది మాకు వెన్నతో పెట్టిన విద్య గురువుగారు!మోడీ సారూ.. ఎప్పుడు నేర్చుకుంటావు బాసు?
ఇంకా రాద్దామని ఉంది కానీ, ఇక్కడ చదువుకొన్న వాడూ, చదువుకోని వాడు అందరూ ఒకటే. వాళ్లకు వాస్తవాలు అక్కర్లేదు. దేశం అసలే అక్కర్లేదనుకో, పెట్రోల్ గ్యాస్ రేట్లు తప్ప….మారండి సార్ మారండి!

– మృశి

Leave a Reply