– ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు చైర్మన్ డాక్టర్ పి. కృష్ణయ్య
విజయవాడ/జక్కంపూడి: పరిశ్రమల నుంచి వచ్చే వ్యర్ధాలను నివాస ప్రాంతాల్లో వారి బోస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు చైర్మన్ డాక్టర్ పి. కృష్ణయ్య అన్నారు. జక్కంపూడి గ్రామం లోని 60:40 స్థలాల్లో రసాయన వ్యర్థాలను పారబోసిన ప్రాంతాన్ని ఆయన పరిశీలించి మాట్లాడారు.రసాయనాల వ్యర్ధాలను పారబోసే పరిశ్రమలను సీజ్ చేస్తా హెచ్చరించారు.
అనకాపల్లికి చెందిన కెమికల్ ప్యాక్టరీ వారు ఈ వ్యర్ధాలను పారబోసినట్లుగా గుర్తించామన్నారు. పర్యావరణ చట్టం కింద ఆ సంస్థపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. వ్యర్థాలతో కలుషితమైన ఈ ప్రాంతాన్ని పరిశుభ్రంగా మార్చేందుకు అవసరమైన చర్యలు చేపడతామన్నారు. ఆ విషయమై అధికారులతో మాట్లాడతామని పేర్కొన్నారు. ఇలాంటి ఘటనలకు పాల్పడటం దురదృష్టకరమని, మున్ముందు ఇలాంటివి పునరావృతమైతే ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. వ్యర్ధాలను నివాస ప్రాంతంలో కలపడం వల్ల ప్రజల ఆరోగ్యం పాడవుతుందన్నారు. వ్యర్ధాలను పంపిన పరిశ్రమను మూసివేయడం జరిగిందని అన్నారు. పలువురు గ్రామస్తులు ఆయన వెంట ఉన్నారు.