ఇన్నర్ వీల్ క్లబ్ ఆఫ్ విజయవాడ ఈస్ట్ నూతన అధ్యక్షరాలిగా డాక్టర్ పి.రేవతి
విజయవాడ: సామాజిగ సేవా కార్యక్రమాలే ధ్యేయంగా ఇన్నర్ వీల్ క్లబ్ ఆఫ్ విజయవాడ ఈస్ట్ ముందడుగు వేస్తుందని క్లబ్ నూతన అధ్యక్షరాలు డాక్టర్ పి.రేవతి అంబారు. నగరంలోని ఎన్ఏసి కళ్యాణ మండపం లో ఇన్నర్ వీల్ క్లబ్ ఆఫ్ విజయవాడ ఈస్ట్ నూతన కార్యవర్గం బాధ్యతలు తీసుకుంది. 2024-25 సంవత్సరానికి గాను కార్యవర్గం ఏకగ్రీవం అయ్యుంది.
డాక్టర్ పి.రేవతితో పాటు, ప్రధాన కార్యాదర్శి గా డాక్టర్ డి.అరుణ, ఇతర కార్యవర్గ సభ్యులు ప్రమాణ స్వీకారోత్సవం చేసారు. పూర్వ అంతర్జాతీయ కోశాధికారి సరిత ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా శారీరిక, మానసిక వికలాంగులైన 175 విద్యార్ధులకు డాక్టర్ పి. రేవతి ఉచితంగా స్కూల్ బ్యాగులు పంపిణి చేశారు.