కేసీఆర్‌కు ఓట్లు, సీట్లు తప్పా ప్రజలకు మంచి చేయాలనే ఉద్దేశం లేదు

-బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ కేవలం దళిత బంధు, హుజురాబాద్ ఎన్నికల విజయం నుంచి ప్రజల దృష్టినీ మళ్లించేందుకే రైతు ధర్నాలు, ఢిల్లీ పర్యటనలు చేస్తున్నారని, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ ఆరోపించారు.
సోమవారం మధ్యాహ్నం హైదరాబాద్ లో డీకే అరుణ పత్రిక ప్రకటన విడుదల చేశారు.రైతు చట్టాలపై కేంద్రం మెడలు వంచుతా అని మాట్లాడుతున్న కెసిఆర్, తన మాట తీరును మార్చుకోవాలని ఆమె సూచించారు.కెసిఆర్ కు కేవలం ఓట్లు సీట్లు తప్పా ప్రజలకు మంచి చేయాలనే ఉద్దేశం ఆయనకు లేదని డీకే అరుణ అన్నారు.
తెలంగాణ రాష్ట్రంలో రైతులు వరి కుప్పల పై పడి గుండెలు పగిలి చనిపోతుంటే, నష్ట పరిహారం ఇవ్వాలనే సోయి ముఖ్యమంత్రి కెసిఆర్ కు లేదు కాని, పక్క రాష్ట్రాలలో మృతి చెందిన రైతులకు 3 లక్షల నష్ట పరిహారం ఇస్తానని చెప్పిన మాట, కన్న తల్లికి అన్నం పెట్టని కొడుకు చిన్నమ్మకు బంగారు గాజులు చేపించినట్టు ఉంది ముఖ్యమంత్రి తీరు అని డీకే అరుణ నిప్పులు చెరిగారు.
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం తమ ప్రాణాలను త్యాగం చేసిన అమరుల కుటుంబాలను పట్టించుకోని ముఖ్యమంత్రి మాటలు తెలంగాణ ప్రజలు నమ్మరని,ఉద్యోగం లేక ఆత్మహత్య కు పాల్పడ్డ నిరుద్యోగ యువత సమస్య గాలికి వదిలేశాడు, ఉద్యోగ నోటిఫికేషన్ కోసం యువత రోడ్డు ఎక్కితే, మద్యం నోటిఫికేషన్ ఇచ్చి టెండర్ల రూపంలో వేల కోట్ల రూపాయలు దోచుకున్నారని, దోచుకోవడం లో ప్రపంచ నెంబర్ 1 అవార్డ్ ముఖ్యమంత్రి కెసిఆర్ కు దక్కుతుంది అని డీకే అరుణ మండిపడ్డారు.ముఖ్యమంత్రి తన వ్యవహార శైలిని మార్చుకొని , అహంను పక్కన పెట్టాలని… తెలంగాణ రైతులను ఆదుకోవాలని డీకే అరుణ డిమాండ్ చేసారు.

Leave a Reply