మోదీగారిపై కామెంట్ చేసేంత మొనగాళ్లా?

Spread the love

-మీరు, మీ అయ్య మోదీ కాలిగోటి కూడా సరిపోరు
-నిధుల్ని ముఖ్యమంత్రి కేసీఆర్ ఎందుకు దొంగతనం చేశారో సమాధానం చెప్పండి
-మీ చెల్లె లిక్కర్ స్కామ్ లో… మీరు డ్రగ్ స్కాం లో…. మీ అయ్య కాళేశ్వరం స్కామ్ లో..
-బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ

రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు ప్రధానమంత్రి నరేంద్రమోదీ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కుమార్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పై చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాను.కేటీఆర్… ప్రియతమ మోదీపై కామెంట్ చేసేంత మొనగాళ్లు అయ్యారా? మీరు, మీ అయ్య మోదీ కాలిగోటి కూడా సరిపోరు.

రష్యా, ఉక్రెయిన్ యుద్ధం గురించి మాట్లాడుతున్న మీరు, ముందుగా ఉద్యోగస్తులకు ప్రతినెలా ఒకటో తేదీన జీతాలు ఎందుకు ఇస్తలేరో సమాధానం చెప్పండి. నాలుగేళ్లుగా ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఎందుకు అమలు చేయడం లేదు? రుణమాఫీ, నిరుద్యోగ భృతి, పేదలకు డబుల్ బెడ్రూం ఇండ్లు, దళితులకు మూడెకరాలుసహా ప్రజలకు ఇచ్చిన హామీలను ఎందుకు అమలు చేయడం లేదో సమాధానం చెప్పండి.

నరేంద్ర మోదీ ఫ్రీ రేషన్ ఇచ్చినప్పటికీ నువ్వు ఇంకా ప్రజలకు ఎందుకు ఇయ్యట్లేదు… దానికి సమాధానం చెప్పండి. రూ. లక్ష కోట్లు పెట్టి కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించామని గొప్పలు చెప్పుకుంటున్న మీరు అదనంగా ఎన్ని ఎకరాలకు సాగు నీళ్లు ఇచ్చినారో ప్రజలకు జవాబు చెప్పండి. గ్రామపంచాయతీలకు కేంద్ర ప్రభుత్వం నేరుగా బ్యాంకు అకౌంట్లో జమ చేసిన నిధుల్ని ముఖ్యమంత్రి కేసీఆర్ ఎందుకు దొంగతనం చేశారో సమాధానం చెప్పండి.

సిగ్గులేకుండా రాష్ట్రంలో అరాచక, అవినీతి పాలన చేస్తున్న మీకు మోదీ గురించి మాట్లాడే నైతిక అర్హత లేదు. నరేంద్ర మోదీ స్వచ్ఛమైన రాజకీయ నాయకుడు. ఆయనకు భారతదేశమే కుటుంబం. మీది అవినీతి కంపులో దొర్లుతున్న కుటుంబం. మీ చెల్లె లిక్కర్ స్కామ్ లో… మీరు డ్రగ్ స్కాం లో…. మీ అయ్య కాళేశ్వరం స్కామ్ లో… టోటల్ గా మీ ఫ్యామిలీ స్కాముల్లో కూరుకుపోయిన దొంగలు.

ఏదో ఒక రోజు మీరంతా ఒకే చోట చిప్పకూడు తినడం ఖాయం. మూడేళ్ల నుండి కేంద్రానికి తెలంగాణ రూ.3.68 లక్షల కోట్లు ఇచ్చినట్లు లెక్కలు చెబుతుండటం హాస్యాస్పదం. ఆ రోజు నుంచి ప్రజలు ఇంకా పనులు కట్టడంలేదా?కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు నిధులివ్వడం లేదని మీరు చెప్పడం సిగ్గు చేటు. మీరు కళ్ళు లేని కబోదిలా మాట్లాడుతున్నారు.

తెలంగాణలో కేవలం జాతీయ రహదారుల నిర్మాణానికి లక్ష కోట్ల రూపాయల్ని ఖర్చుపెట్టిన ఘనత కేంద్రానిదే.తెలంగాణకు కేంద్రం ఎన్ని నిధులిచ్చిందనే విషయంపై బహిరంగ చర్చకు సిద్ధమని రెండేళ్లుగా సవాల్ విసురుతున్నాం. అయినా నేటికీ చర్చకు రాని మీరు మళ్లీ కొత్త డ్రామా మొదలు పెట్టడం సిగ్గు చేటు.

డ్రగ్స్ కేసు తెరపైకి వచ్చినప్పుడు సందర్భంగా మీరు డ్రగ్స్ తీసుకున్నారని, దమ్ముంటే శాంపిల్ ఇవ్వాలని రెండేళ్ల కిందనే మేము డిమాండ్ చేస్తే నాడు మౌనంగా ఉన్న మీరు… దొంగలు పడ్డ ఆర్నెళ్లకు కుక్కలు మోరిగినట్లుగా డ్రగ్స్ ఆనవాళ్లు పూర్తిగా మాయమయ్యాయని నిర్దారించుకున్న తరువాత వచ్చి చాలెంజ్ చేయడాన్ని చూసి తెలంగాణ సమాజం నవ్వుకుంటోంది.

మొన్నటి సెస్ ఎలక్షన్లో మా బీజేపీ నాయకులు మీకు ట్రైలర్ మాత్రమే చూపించారు. వచ్చే ఎన్నికల్లో కచ్చితంగా సిరిసిల్లలో మీకు అసలు సిసిలు సినిమా చూపిస్తాం. సెస్ ఎన్నికల్లో గెలుపు కోసం నీవు ఎన్ని నువ్వు ఎన్ని అడ్డదారులు తొక్కినవో యావత్ తెలంగాణ సమాజం చూసింది. బిజెపి గెలిచిన సీటును కూడా నిర్లజ్జగా తారుమారు చేసి మీ ఖాతాలో కలుపుకున్న దుర్మార్గులు మీరు.

వేములవాడ దేవాలయానికి ఏటా 100 కోట్లు చొప్పున రూ.400 కోట్లు ఇస్తానని మీ అయ్య హామీ ఇచ్చి ఏడేళ్లు కావొస్తుంది. ఆ నిధులిస్తవో ప్రజలకు సమాధానం చెప్పండి.‘ప్రసాద్’ స్కీం కింద ప్రతిపాదనలు పంపితే వేములవాడ ఆలయ అభివ్రుద్ధికి నిధులు మంజూరు చేయిస్తామని బండి సంజయ్ గారు మూడేళ్లుగా కోరుతున్నా ఇంతవరకు ఎందుకు ప్రతిపాదనలు పంపలేదో సమాధానం చెప్పండి. వేములవాడ ఆలయం అభివ్రుద్ధి అయితే నరేంద్రమోదీ ప్రభుత్వానికి, బండి సంజయ్ కి పేరొస్తుందనే భయంతో ప్రతిపాదనలు పంపకుండా ఎములాడ రాజన్ననే మోసం చేసిన మీరా మాట్లాడేది?

రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ కొనసాగింపును రద్దు చేస్తూ హైకోర్టు ధర్మాసనం మొట్టికాయ వేసినా మీలో ఇంకా మార్పు రాకపోవడం సిగ్గు చేటు. ఏపీకి కేటాయించిన సోమేశ్ కుమార్ ను ఇక్కడ ఉంచడమే కాకుండా, మీ అవినీతి కోసం ఆయనకు సిఎస్ ని కూడా చేశారు. తెలంగాణలో సీఎస్ పదవికి అర్హులైన అధికారులు లేరా? పోయేకాలం దగ్గరకు వస్తే గిట్లంటి చెత్తబుద్దిలే వస్తాయి. నరేంద్రమోదీ గురించి, బీజేపీ నేతల గురించి పిచ్చిపిచ్చిగా వాగితే ఊరుకునేది లేదు. నోటిని హద్దులో ఉంచుకుని మాట్లాడాలని హెచ్చరిస్తున్నా.

Leave a Reply