Suryaa.co.in

Andhra Pradesh

మద్యం కేసులో తొందరపాటు చర్యలొద్దు

-ఏపీ సీఐడీకి హైకోర్టు ఆదేశం
-చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్ పై తీర్పు రిజర్వ్
-ముందస్తు బెయిల్ పిటిషన్లు పెట్టుకున్న చంద్రబాబు, కొల్లు రవీంద్ర
-ఆంధ్ర ప్రదేశ్ హైకోర్టులో ముగిసిన ఇరువైపు వాదనలు
-తొందరపాటు చర్యలు తీసుకోవద్దంటూ సీఐడీని ఆదేశించిన హైకోర్టు

మద్యం కేసులో టీడీపీ అధినేత చంద్రబాబునాయుడికి ఊరట లభించింది. ఈ కేసులో చంద్రబాబు, మాజీ మంత్రి కొల్లు రవీంద్రలపై తొందరపాటు చర్యలు తీసుకోవద్దని హైకోర్ట్ ఆదేశాలు జారీ చేసింది. సోమవారం ఈ కేసుపై హైకోర్టులో విచారణకు రాగా తీర్పును న్యాయస్థానం రిజర్వ్ చేసింది. గతంలో వాదనలు పూర్తికావడంతో లిఖిత పూర్వక వాదనలు సమర్పించాలని కోర్టు ఆదేశించింది.

కోర్టు ఆదేశాల మేరకు సోమవారం చంద్రబాబు, సీఐడీ తరపు న్యాయవాదులు లిఖిత పూర్వక వాదనలు సమర్పించారు. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు అరెస్ట్ చేయవద్దని, గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను కొనసాగించాలని హైకోర్టు స్పష్టం చేసింది. అనంతరం తీర్పును హైకోర్టు ధర్మాసనం రిజర్వ్ చేసింది. తీర్పు చెప్పే వరకు చంద్రబాబుపై ఎటువంటి తొందర పాటు చర్యలు తీసుకోవద్దని హైకోర్టుల ఆదేశాలు జారీ చేసింది.

మద్యం కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు , మాజీ మంత్రి కొల్లు రవీంద్ర పెట్టుకున్న ముందస్తు బెయిల్ పిటిషన్లపై ఏపీ హైకోర్టులో వాదనలు ముగిశాయి. ఇరువైపు వాదనలు విన్న హైకోర్టు తీర్పును రిజర్వ్ లో ఉంచింది. తాము తీర్పును వెలువరించేంత వరకు తొందరపాటు చర్యలు తీసుకోవద్దని సీఐడీని ఆదేశించింది. మరోవైపు స్కిల్ డెవలప్ మెంట్ కేసులో చంద్రబాబు క్వాష్ పిటిషన్ పై సుప్రీంకోర్టు తీర్పును రిజర్వ్ లో ఉంచింది. మంగళవారం ఈ కేసులో తీర్పు వెలువడే అవకాశం ఉంది.

మద్యం కేసులో తొందరపాటు చర్యలొద్దు: మద్యం కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు, మాజీ మంత్రి కొల్లు రవీంద్ర దాఖలు చేసిన ముందస్తు బెయిల్‌ పిటిషన్లపై హైకోర్టులో వాదనలు ముగిశాయి. తీర్పును ఉన్నత న్యాయస్థానం రిజర్వు చేసింది. ఈ కేసులో తుది తీర్పు వచ్చే వరకు తొందరపాటు చర్యలొద్దని ఏపీ సీఐడీని హైకోర్టు ఆదేశించింది.

ఈనెల 23న జరిగిన విచారణలో చంద్రబాబు తరఫున సీనియర్‌ న్యాయవాదులు నాగముత్తు, దమ్మాలపాటి శ్రీనివాస్‌ వాదనలు వినిపించారు. మద్యం దుకాణాల లైసెన్స్‌దారులకు 2015-17 సంవత్సరాల్లో ప్రివిలేజ్‌ ఫీజు విధింపు నిబంధన తొలగింపునకు ప్రతిపాదించిన ఫైలు అప్పటి సీఎం చంద్రబాబు వద్దకు వెళ్లలేదని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. అప్పటి ఎక్సైజ్‌ శాఖ మంత్రి, కమిషనర్‌ స్థాయిలో నిర్ణయం తీసుకున్నారని పేర్కొన్నారు.

ఫైలును ఆర్థిక శాఖకు పంపకపోవడాన్ని సీఐడీ ఆక్షేపించడం సరికాదని, ఈ విషయంలో ప్రత్యేక ప్రధాన కార్యదర్శి నిర్ణయం తీసుకోవాలని తెలిపారు.అందుకు అప్పటి సీఎం, మంత్రిని బాధ్యులను చేయడం సరికాదన్నారు. పిటిషనర్‌పై దురుద్దేశపూర్వకంగా కేసు నమోదు చేశారని, ముందస్తు బెయిల్‌ మంజూరు చేయాలని కోరారు. గురువారం జరిగిన విచారణలో ఇరువైపులా వాదనలు ముగించిన న్యాయస్థానం మౌఖికంగా తెలిపిన వివరాలను రాతపూర్వకంగా కోర్టు ముందుంచాలని పిటిషనర్లకు సూచిస్తూ విచారణను నేటికి వాయిదా వేసింది.

సోమవారం తీర్పును రిజర్వు చేస్తూ తొందరపాటు చర్యలు వద్దని సీఐడీని హైకోర్టు ఆదేశించింది. గత ప్రభుత్వ హయాంలో మద్యం కంపెనీలకు అనుచిత లబ్ధి చేకూర్చేలా నిర్ణయాలు తీసుకున్నారన్న ఆరోపణలతో బెవరేజెస్‌ కార్పొరేషన్‌ ఎండీ వాసుదేవరెడ్డి ఫిర్యాదు ఆధారంగా చంద్రబాబు, కొల్లు రవీంద్ర, ఎక్సైజ్‌ శాఖ కమిషనర్‌పై సీఐడీ కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే.

LEAVE A RESPONSE