Suryaa.co.in

Telangana

టిమ్స్ ని మూయవద్దు.. సిబ్బందిని తీయొద్దు

– ఏఐసిసి జాతీయ అధికార ప్రతినిధి డా. దాసోజు శ్రవణ్ డిమాండ్

కేసీఆర్ ప్రభుత్వం తీరు ఏరు దాటే దాకా ఓడ మల్లయ్య, ఏరు దాటాక బోడి మల్లయ్య అన్నట్టుగా వుంది. కరోనా మహమ్మారి సమయంలో వైద్య సిబ్బంది తమ ప్రాణాలకు తెగించి సేవలు అందించారు. కానీ నేడు కోవిడ్ ముగిసిందని చెప్పి, కాంట్రాక్ట్ రద్దుని చేసుకొని టిమ్స్ సిబ్బందిని విధుల నుంచి తొలగించాలనుకునే నిర్ణయం దుర్మార్గమైనది.

ప్రైమరీ హెల్త్ సెంటర్లు, బస్తీదవాఖానాలో వైద్య సిబ్బంది కొరత వుంది. ఉస్మానియా, గాంధీ హాస్పిటల్ లో వేల నర్సు ఉద్యోగాలు ఖాళీగా వున్నాయి. టిమ్స్ ని మూసివేయకుండా అక్కడ పని చేస్తున్న సిబ్బందితో ఖాళీలు పూరించి వారి సేవలు వాడుకోవచ్చు, కానీ విచక్షణ రాహిత్యంగా వైద్య సిబ్బంది జీవితాలతో చెలగాటం భాద్యతగల ప్రభుత్వానికి తగదు.

‘టిమ్స్’ని మూసివేయడం అంటే కేసీఆర్ ప్రభుత్వం పరోక్షంగా ప్రైవేట్ హాస్పిటల్స్ కొమ్ముకాసినట్లే. టిమ్స్ లో పని చేసిన వైద్య సిబ్బందికి అండగా నిలబడాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. దీనిపై అసెంబ్లీలో పోరాటం చేస్తాం. భాద్యతగల శాసన సభ్యులంతా ఈ పోరాటంలో కలసి రావాలి.

”కోవిడ్ లాంటి బయోవార్ నుంచి బతికి బట్టకట్టి బ్రతుకుతున్నాం అంటే దానికి కారణం వైద్యులు, నర్సులు, పారామెడికల్ సిబ్బంది. వారు ప్రాణాలకు తెగించి అందించిన సేవలు. అలాంటి వారిపట్ల మనం కృతజ్ఞతతో వుండాలి. కానీ నేడు మానవత్వం మర్చిపోయి, భాద్యతరాహితంగా తెలంగాణ రాష్ట్రం ప్రభుత్వం వ్యవహరిస్తుంది. తెలంగాణ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (టిమ్స్) ని మూసివేసి వేయాలనే ఆలోచనతో పాటు వైద్యులు, నర్సులు, పారా మెడిక్స్ సిబ్బందిని తొలగించాలని నిర్ణయం తీసుకోవడం దుర్మార్గం. కేసీఆర్ ప్రభుత్వం తీరుని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి” అని ఏఐసిసి జాతీయ అధికార ప్రతినిధి డా. దాసోజు శ్రవణ్ డిమాండ్ చేశారు.

టిమ్స్ హాస్పిటల్ ని మూసివేయడం, అక్కడ సిబ్బందిని తొలగించడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న నేపధ్యంలో ప్రభుత్వం నిర్ణయాన్ని తప్పుపడుతూ ముఖ్యమంత్రి, సహా ఆరోగ్యశాఖ మంత్రి కాంగ్రెస్ పార్టీ తరపున లేఖ రాశారు దాసోజు.

”కేసీఆర్ ప్రభుత్వం తీరు ”ఏరు దాటే దాకా ఓడ మల్లయ్య, ఏరు దాటాక బోడి మల్లయ్య”అన్నట్టుగా వుంది. కరోనా మహమ్మారి సమయంలో చాలా మంది వైద్య నిపుణులు, నర్సులు, పారా మెడికల్ సిబ్బంది తమ ప్రాణాలకు తెగించి సేవలు అందించారు. 30 వేల మందికి సేవలు అందించారు. వైద్యులు, నర్సులు పారా మెడికల్ సిబ్బందిగా ప్రజల ప్రాణాలు కాపాడటానికి తమ జీవితాలను పణంగా పెట్టారు.కానీ నేడు కోవిడ్ ముగిసిందని చెప్పి, కాంట్రాక్ట్ రద్దుని చేసుకొని సిబ్బందిని విధుల నుంచి తొలగించాలనుకునే నిర్ణయం దుర్మార్గమైనది. మానవత్వం, సామాజిక స్పృహ వున్న ఏ ప్రభుత్వం కూడా ఇంత అనైతికంగా వ్యవహరించదు” అని విమర్శించారు దాసోజు.

కోవిడ్ ముగిసిపోయిందనే నెపం చూపుతూ ఈ మధ్య కాలంలో 1700మంది నర్సులని విధుల నుంచి తొలగించారు. ప్రైమరీ హెల్త్ సెంటర్లు, బస్తీదవాఖానాలు. ఉస్మానియా, గాంధీ హాస్పిటల్…ఇలా చెప్పుకుంటూపొతే వేల నర్సు ఉద్యోగాలు ఖాళీగా వున్నాయి. వందల డాక్టర్ ఉద్యోగాలు ఖాళీగా వున్నాయి. టిమ్స్ ని మూసివేయకుండా అక్కడ పని చేస్తున్న సిబ్బందితో ఖాళీలు పూరించవచ్చు, వారి సేవలు వాడుకోవచ్చు, కానీ విచక్షణ రాహిత్యంగా వైద్య సిబ్బందితో చెలగాటం భాద్యతగల ప్రభుత్వానికి తగదు.

తెలంగాణ వస్తే కాంట్రాక్ట్ అనే మాట చోటు వుండదని చెప్పిన ముఖ్యమంత్రి, 50వేల ఉద్యోగాలు బర్తీ చేస్తామని చెప్పిన ముఖ్యమంత్రి.. ఇపుడు వున్న ఉద్యోగాలు తీసేయండ ఏంటి ? దయచేసి వైద్య సిబ్బందిని తొలగించవద్దు ”అని కోరారు దాసోజు.

2వేల నర్సుల పోస్టులు ఖాళీగా వున్నాయి. వందలాది డాక్టర్ల పోస్టులు ఖాళీ వున్నాయి. వందలాది పారా మెడికల్ పోస్టులు ఖాళీగా వున్నాయి. కాబట్టి మానవత్వంతో అలోచించి టిమ్స్ హాస్పిటల్ ని మూసివేయకండి. టిమ్స్ ని మూసివేయడం అంటే పరోక్షంగా ప్రైవేట్ హాస్పిటల్స్ కొమ్ముకాసినట్లే. కోవిడ్ లాంటి బయోవార్ తో పోరాటం చేసి ప్రజలకు సేవలు అందించిన వైద్యులు, నర్సులు, పారామెడికల్ సిబ్బంది జీవితాలకు భద్రత కల్పించే భాద్యత ప్రభుత్వం వుంది” అని విజ్ఞప్తి చేశారు దాసోజు.

టిమ్స్ లో పని చేసిన వైద్య సిబ్బందికి అండగా నిలబడాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. దీనిపై అసెంబ్లీలో పోరాటం చేస్తాం. కానీ ప్రధాన ప్రతిపక్షం అని చెప్పుకుంటున్న ఏంఐఏం పార్టీ కూడా ఈ పోరాటంలో కలసి రావాలి. అసద్, అక్బరుద్దిన్ ఈ అంశంపై ద్రుష్టి పెట్టాలి. అసెంబ్లీలో చర్చ జరపాలి, దాదాపు 30వేల మంది టిమ్స్ లో సేవలు పొందారో వారిలో ఎక్కువ మంది ఓల్డ్ సిటీ నుంచి వచ్చిన వాళ్ళే వున్నారు.

LEAVE A RESPONSE