టీడీపీ పొలిట్ బ్యూరోసభ్యులు, మాజీ మంత్రివర్యులు నక్కా ఆనంద్ బాబు
గంజాయి సాగు, రవాణాపై మాట్లాడానని అర్థరాత్రి నర్సీపట్నం పోలీసులు నాఇంటికొచ్చి నోటీసులిచ్చారు. ఆధారాలు సేకరించాలంటూ నానాహంగామా సృష్టించారు. మరి ఇదే పోలీసులు, డీజీపీ విజయసాయిరెడ్డికి ఎప్పుడు నోటీసులిస్తున్నారు? విజయసాయిరెడ్డి నిన్న గంజాయి సాగుతో లోకేశ్ కు సంబంధముందన్నాడు. ఆయన వ్యాఖ్యల్లోని నిజమెంతో డీజీపీ తేల్చాలి. పవన్ కల్యాణ్ మాదకద్రవ్యాలకు కేంద్రంగా ఏపీ మారిందన్నాడు. జనసేన అధినేతకు నోటీసులిచ్చే ధైర్యం ఈపోలీసులకు ఉందా? దళితనేతననని, కులంతక్కువ వాడినని పోలీసులు నాఇంటికి వచ్చారా? విజయసాయిరెడ్డి జగన్మోహన్ రెడ్డి సహనిందితుడు మాత్రమే, అతనికి ప్రత్యేకమైన అర్హతలేమీ లేవు. నర్సీపట్నం సీఐ, విశాఖ డీఐజీ తొందరగా వెళ్ళి, తక్షణమే విజయసాయిరెడ్డికి నోటీసులు ఇవ్వాలి. ఆధారాలు ఏమున్నాయో ఆయనవద్దనుంచి సేకరించాలి. హైదరాబాద్ సీపీ అంజనీకుమార్, నల్గొండ ఎస్పీలు గంజాయి మొత్తం ఏపీనుంచే తెలంగాణకు వస్తుందన్నారు. వారికి కూడా ఈ డీజీపీ నోటీసులిప్పిస్తాడా? కర్ణాటక, కేరళ, తమిళనాడు పోలీసులకు కూడా డీజీపీ నోటీసులిచ్చి, ఆధారులు సేకరిస్తాడా? పోలీసులు, ఏపీప్రభుత్వ వైఫల్యం వల్లే, రాష్ట్రంలో గంజాయి సాగు, రవాణా జరుగుతోంది. తాను, పట్టాభి ఏం మాట్లాడామని రాష్ట్రాన్ని అల్లకల్లోలంచేసి, పనికిరాని ఉల్ఫాలతో చంద్రబాబుని తిట్టించారు? రాష్ట్రంలో ప్రతిపక్షనేతలకు, ప్రజలకు జీవించేహక్కు లేకుండా పోయింది. అత్యుత్సాహం ప్రదర్శించే అధికారులంతా ఏదోఒకరోజు సమాధానం చెప్పాల్సిందే. అంతిమంగా బలయ్యేది కిందిస్థాయి అధికారులే. అధికారుల సంగతి కోర్టుల్లోనే తేలుస్తాం.. రాబోయే రోజుల్లో ప్రతిపక్షనేతలకు నోటీసులిస్తే, అందుకు బాధ్యతవహించకతప్పదు.