Suryaa.co.in

Telangana

అశోక్ నగర్ కు వచ్చి విద్యార్థులతో మాట్లాడే దమ్ము రేవంత్ రెడ్డికి ఉందా?

– రేవంత్ రెడ్డికి భూములపై ప్రేమ ఎక్కువ
– రేవంత్ రెడ్డి గురుకులాలను నిర్వీర్యం చేశారు
– ఉద్యోగులను రేవంత్ బ్లాక్ మెయిల్ చేస్తున్నారు
– కార్పొరేట్ కాలేజీల కోసం గురుకుల కాలేజీలను మూసివేస్తున్నారు.
– ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఎప్పటిలోగా కడతారో
చెప్పాలి
– కమీషన్ల కోసమే యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ నిర్మాణం
గురుకులాల స్కూల్స్ కు ఎందుకు రెంట్లు కట్టడం లేదు?
– బిఆర్ ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్

హైదరాబాద్: సీఎం రేవంత్ రెడ్డి గురుకుల అవార్డు కార్యక్రమంలో అబద్దాలు మాట్లాడారు. విద్యార్థుల కార్యక్రమంలో సీఎం రాజకీయాలు మాట్లాడారు. కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేస్తానని చెప్పిన రేవంత్ రెడ్డి గురుకులాలను నిర్వీర్యం చేశారు.

కేసీఆర్ హయాంలో గురుకులాలు అప్ గ్రేడ్ అయ్యాయి. గురుకులాల్లో ఇంటర్ విద్యను మూసివేసే ప్రయత్నం రేవంత్ రెడ్డి చేస్తున్నారు. కార్పొరేట్ కాలేజీల కోసం గురుకుల కాలేజీలను రేవంత్ రెడ్డి మూసివేస్తున్నారు. ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఎప్పటిలోగా కడతారో రేవంత్ రెడ్డి చెప్పాలి. అప్పటి వరకు గురుకులాలను మూసివేసే కుట్ర చేస్తున్నారు.

ప్రభుత్వం వద్ద డబ్బులు లేవని సీఎం ఉద్యోగులను బ్లాక్ మెయిల్ చేస్తున్నారు. గురుకుల స్కూల్స్ భవనాల యజమానులకు డబ్బులు ఇవ్వడం లేదు. పెద్ద,పెద్ద కాంట్రాక్టర్లకు డబ్బులు ఇవ్వడానికి ప్రభుత్వం వద్ద డబ్బులు ఉన్నాయి.

ప్రపంచ సుందరి పోటీలు హాస్యాస్పదంగా మారాయి. ప్రయివేటు ఏజెన్సీలతో ప్రపంచ సుందరి పోటీలు నిర్వహిస్తున్నారు. ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారో రేవంత్ రెడ్డి చెప్పాలి. బిఆర్ఎస్ ఇచ్చిన గ్రూప్1 నోటిఫికేషన్ ను రేవంత్ రెడ్డి సీఎం అయ్యాక రీ నోటిఫికేషన్ ఇచ్చారు. గ్రూప్1 నియామకాలు జరగకుండా హైకోర్టు స్టే ఇచ్చింది.గ్రూప్1 ఉద్యోగాలు బిఆర్ఎస్ ఆపింది అని రేవంత్ రెడ్డి హైకోర్టు తీర్పును తప్పుపడుతున్నారు.

అశోక్ నగర్ కు వచ్చి విద్యార్థులతో మాట్లాడే దమ్ము రేవంత్ రెడ్డికి ఉందా? సోషల్ వెల్ఫేర్ స్కూల్స్ లో విద్యార్థులతో పనులు చేపించి వారితో వంట వండించే విధంగా సర్క్యులర్ ఇచ్చారు.రేవంత్ రెడ్డి సీఎం అయ్యాక గురుకులాల్లో జాయిన్ కావాలంటే విద్యార్థులు భయపడుతున్నారు. గురుకులాల అడ్మిషన్లు పడిపోయే విధంగా ప్రభుత్వం వ్యవహరిస్తోంది.

ప్రభుత్వం విద్యా వ్యతిరేక విధానాన్ని వీడినాడాలి. గ్రూప్ 1 రిజల్ట్స్ విషయంలో అభ్యర్థులు కోర్టుకు వెళ్లారు.హైకోర్టు తీర్పును బట్టి బిఆర్ఎస్ కార్యాచరణ ఉంటుంది. బి ఆర్ ఎస్ కులాల వారీగా గురుకులాలను పెట్టలేదు. ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ పేరుతో గురుకులాలను నాశనం చేస్తున్నారు. గురుకులాల్లో విద్యార్థులు డ్రాప్ ఔట్ అవుతున్నారు.

విద్యా కమీషన్ నివేదికను ప్రభుత్వం పక్కన పెట్టింది. విద్యార్థుల సమస్యలు పరిష్కారం చేయకపోతే బిఆర్ఎస్వీ ఆధ్వర్యంలో
సెక్రటేరియట్ ముట్టడి చేస్తాము.

విద్యావ్యవస్థ చిన్నాభిన్నం: బిఆర్ఎస్వీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు తుంగ బాలు
రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రి లేక విద్యావ్యవస్థ చిన్నాభిన్నం అయింది. రాష్ట్రంలో గురుకులాలు మూసివేసే విధంగా ప్రభుత్వం చర్యలు ఉన్నాయి. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూళ్ల నిర్మాణానికి 2,400 కోట్ల అంచనాలు పెంచారు. కమీషన్ల కోసమే యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ నిర్మాణం చేస్తున్నారు
విద్యాశాఖలో ఉన్నత స్థాయి సమీక్షలు లేవు. రేవంత్ రెడ్డిది ప్రజా పాలన అయితే మీ పార్టీలో చేరిన పది మంది ఎమ్మెల్యేలతో రాజీనామా చేపించు.

ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ మీ ఇంటిగ్రిటి పెంచుకొవడం కోసమే. కేసీఆర్ పేరు ఎత్తకుండా ఏ ఒక్క సమావేశంలో రేవంత్ రెడ్డి మాట్లాడలేరు. ఉస్మానియా యూనివర్సిటీ భూములను లీజుకు ఇవ్వాలని రేవంత్ రెడ్డి ప్రయత్నం చేస్తున్నారు. రేవంత్ రెడ్డికి భూములపై ప్రేమ ఎక్కువ.

గురుకులాల స్కూల్స్ కు ఎందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం రెంట్లు కట్టడం లేదు? రేవంత్ రెడ్డి ఓటుకు నోటు కేసులో దొరికారు.

LEAVE A RESPONSE