– మేడిగడ్డ మూడు పిల్లర్లు రిపేర్ చేయాలి
– మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్
హైదరాబాద్: మేడిగడ్డ ప్రాజెక్టు రిపేర్ చేయడానికి ఎన్.డి.ఎస్.ఏ
రిపోర్ట్ అవసరం లేదని నేను చెప్పాను. ఎన్.డి.ఎస్.ఏ సైతం మేడిగడ్డ ప్రాజెక్టు రిపేర్ చేయాలని చెప్పింది. మేడి గడ్డ మరమ్మత్తులకు సంబంధించి పాండ్యా నేతృత్వం లో కమిటి వేయడాన్ని స్వాగతిస్తున్నా. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా మరమ్మత్తులు చేయాలి.
ఎన్ డి ఎస్ ఏ కు నిర్ణయాధికారం వదిలేయకుండా రాష్ట్ర ప్రభుత్వం మేడి గడ్డ బ్యారేజ్ మరమ్మత్తులు చేయవచ్చని మొదటి నుంచి నేను చెబుతూనే ఉన్నా. మేడిగడ్డ వద్ద నీళ్లు నిల్వ చేయకపోవడంతో నీళ్లు సముద్రం పాలు అయ్యాయి.
అన్నారం,సుందిళ్ళ బ్యారేజీలకు ఏమీ కాలేదు.మేడిగడ్డ ప్రాజెక్టును రిపేర్ చేయడానికి వేసిన కమిటీ ఆలస్యం చేయకుండా రిపేర్ పనులు ప్రారంభం చేయాలి. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆలస్యం చేయకుండా మేడిగడ్డ మూడు పిల్లర్లు రిపేర్ చేయాలి. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ళల్లో నీళ్లు నింపాలి. కాళేశ్వరం కమీషన్ నోటీసులు వచ్చాయి. కాళేశ్వరం కమీషన్ ఏం అడిగినా చెప్పడానికి కేసీఆర్ సిద్ధం.