మా జోలికి రావొద్దు మై డియర్ జగన్..

– విజయనగరం శంఖారావం సభలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్

విజయనగరం : సైకో జగన్ నిన్న ఒకసభలో మాట్లాడుతూ…చొక్కా చేతులు మడతపెట్టాలని వారి కార్యకర్తలకు చెబుతున్నాడు. ఇటు పసుపు సైన్యం, అటు జనసైనికలు కలిసి నీ కుర్చీ మడతపెట్టే రోజులు రాబోతున్నాయి. నీ బ్యాచ్ కు బూమ్ బూమ్, ఆంధ్రాగోల్డ్ కావాలి..కానీ మా కార్యకర్తలకు పసుపు జెండా చూస్తేనే ఎక్కడాలేని ఉత్సాహం వస్తుంది.

మా జోలికి రావొద్దు మై డియర్ జగన్. రెండు నెలల్లో నీ కుర్చీ మడతపెట్టే బాధ్యత మేము తీసుకుంటాం. జగన్ వాస్తవంగా ఒక ప్యాలెస్ పిల్లి. నేను ఆ తాడేపల్లి వైపు ఎప్పుడు వెళ్లినా మ్యావ్ మ్యావ్ అని వినబడుతుంది. అమరావతి రైతులకు అండగా నిలబడేందుకు ఒక సినీనిర్మాత రాజధాని ఫైల్స్ సినిమా తీస్తే, విడుదలవ్వకుండా సైకో సిఎం విశ్వ ప్రయత్నాలు చేశాడు. ప్రజల్ని చూసినా… రైతులను చూసినా ఈ ముఖ్యమంత్రి భయపడతాడు.

రాజధాని విషయంలో ఎన్ని యూటర్న్ లు తీసుకున్నాడు.? వాషింగ్టన్ కు ధీటుగా రాజధాని ఏర్పాటు చేస్తానని చెప్పాడు. కనీసం 30 వేల ఎకరాల్లో రాజధాని ఏర్పాటు చేయాలని సైకో జగన్ నాడు అసెంబ్లీలో చెప్పాడు. మనది 13 జిల్లాల చిన్నరాష్ట్రం…ఒక ప్రాంతానికి మరో ప్రాంతానికి మధ్య చిచ్చులు పెట్టడం ఇష్టంలేక మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నానని చెప్పాడు. రాజధానిగా అమరావతిని స్వాగతిస్తున్నాని చెప్పాడు. అధికారంలోకి వచ్చాక మూడు రాజధానులంటూ ఆట లాడుతున్నాడు. ఈ సందర్భంగా అందరూ ఆలోచించాలి..ఈ ఉత్తరాంధ్రలో ఒక్క ఇటుకైనా వేశాడా…ఒక్క పరిశ్రమైనా తెచ్చాడా..ఒక్క ఉద్యోగమైనా ఇచ్చాడా.?

ఇప్పుడు జగన్ బాబాయి వైవీ సుబ్బారెడ్డి మళ్లీ ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ఉండాలంటున్నారు. బిల్డప్ కోసం యాత్ర సినిమా తీస్తే అది వైసీపీకి అంతిమ యాత్ర అయింది. రాజధాని ఫైల్స్ సినిమాను అందరూ చూడాలి. nసొంత భూమి అందరి కల. 3 పంటలు పండే భూమి చంద్రబాబు పిలుపు మేరకు రాష్ట్ర రాజధాని కోసం త్యాగం చేసి 35 వేల ఎకరాలు ఇచ్చారు. నాడు జగన్, పవన్, మోడీ కూడా అమరావతికి సంపూర్ణంగా మద్ధతిస్తున్నామని చెప్పాకే భూములిచ్చారు. కానీ జగన్ నేడు రైతుల త్యాగాలను అవమానిస్తున్నాడు.

సైకో జగన్ ఒక మాట వాస్తవంగా చెప్పాడు. ఆయనకు స్టార్ క్యాంపెయినర్లు లేరట..జనమే స్టార్ క్యాంపెయినర్లంట. ఛాలెంజ్ చేస్తున్నా…ప్లేస్, టైం చెప్పండి. మీరు తీసుకొచ్చిన బూమ్ బూమ్ దుకాణాల వద్దకు వెళ్దాం..నీ పాలన ఎలా ఉందో మందుబాబులను అడుగుదాం..నువ్వు సిద్ధమా? మద్యం దుకాణాల వద్దకు వెళ్తే మందుబాబులు ఈ ప్రభుత్వాన్ని ఎన్ని బండబూతులు తిడతారో అర్థంమవుతుంది. తెలుగింటి ఆడపడుచులు కూడా ఆలోచించాలి..సంపూర్ణ మద్య నిసేధం చేశాక ఓట్లు అడుగతానన్నాడు చేశాడా.. ఊరూరా, ఇంటింటికి బెల్టు షాపుల ద్వారా మద్యం సరఫరా చేస్తున్నాడు. టార్గెట్ ఇచ్చి మద్యం అమ్మిస్తున్నాడు.

రెండో ఛాలెంజ్ చేస్తున్నా…మీరు ఎంచుకున్న ఇంటికే వెళ్దాం. 4 ఏళ్ల పది నెలల పాలనలో మీరు పెంచిన నిత్యావసర సరకుల ధరలు, విద్యుత్ ఛార్జీలు, వేసిన పన్నుల గురించి అడుగుదాం. రాబోయే ఎన్నికల్లో ఆడబిడ్డలు మీకు షాక్ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారు. డీఎస్సీ అభ్యర్థులు నన్ను కలిశారు. ఒక్క డిఎస్సీ కూడా విడుదల చేయలేదు. నోటిఫికేషన్లు లేవు. ఈ సీఎం ఎప్పుడు దొరుకుతాడా అని యువత చూస్తున్నారు. పరదాలు కట్టుకోవడమే కాదు.. ఎక్కడికి వెళ్లినా రోడ్లపక్కన చెట్లను నరికేస్తున్నారు. జగన్ ను ప్రజలు తరిమేసేందుకు సిద్ధంగా ఉన్నారు.

జగన్ కేసుల్లో నిందితుడు విజయసాయిరెడ్డి. అన్ని కేసుల్లో ఏ2…ఇతను అశోక్ గజపతిరాజును అవమానించాడు. మాన్సాస్ ట్రస్టు ద్వారా అనేక సేవలందించారు. దేశంలోనే అద్భుతమైన సేవలందిస్తున్న స్వచ్చంద సంస్థ మాన్సాస్ ట్రస్టు. దాన్ని బలవంతంగా లాక్కునేందుకు పిల్లిగడ్డం విజయసాయిరెడ్డి ప్రయత్నించాడు. ఈ వేదిక నుండి విజయసాయిరెడ్డికి చెబుతున్నా…మీరు చేసిన దానికి రెట్టింపు చేసి ఎందుకు అశోక్ జగపతిరాజుతో పెట్టుకున్నానా అని భయపడేలా చేస్తా. నిరుపేద కుటుంబాలకు మాన్సాస్ ట్రస్టు అండగా నిలబడింది. మీసాల గీత, అశోక్ గజపతి రాజు గారు విజయనగరాన్ని అభివృద్ధి చేశారు.

కానీ మీరేం చేశారు..తన్నే దున్నపోతును తెచ్చుకున్నారు. స్థానిక ఎమ్మెల్యే వీరభద్రస్వామి అవినీతికి కేరాఫ్ అడ్రస్ గా విజయనగరాన్ని మార్చారు. అవినీతిరాజు ఎవరు అంటే కోలగట్లను చూపిస్తారు. ప్రభుత్వ భూములు లాక్కుని పార్టీ కార్యాలయం కట్టుకున్నారు. సెంటు పట్టాలంటూ రూ.15 లక్షలకు ఎకరా కొని రూ.38 లక్షలకు ప్రభుత్వానికి అమ్మారు. 2 నెలల్లో మన ప్రభుత్వం వస్తుంది, తిన్నదంతా కక్కిస్తాం.

కార్యకర్తలపై అక్రమంగా కేసులు పెట్టించాడు ఈ కోలగట్ల వీరభద్రస్వామి. అశోక్ గజపతిరాజుపై 3 కేసులు పెట్టించారు. ఆయన ఎప్పుడూ ఒకరిని కించపరిచి మాట్లాడే వ్యక్తి కాదు.

Leave a Reply