బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో
బతుకులన్ని ఆగమాయే ఉయ్యాలో
అమరవీరుల కుటుంబాలు ఉయ్యాలో
ఆగమై పాయే ఉయ్యాలో
దొరగారి కుటుంబం ఉయ్యాలో
బంగారు కుటుంబ మాయే ఉయ్యాలో
నిరుద్యోగులకు ఉయ్యాలో
నీడ దోర్కధాయే ఉయ్యాలో
తాగుబోతు పాలనలో ఉయ్యాలో
పోరలంత తాగి చావబట్టే ఉయ్యాలో
చదువు యేమో ఉయ్యాలో
అందని ద్రాక్షాయే ఉయ్యాలో
రోగమొచ్చి మంచాన పడితే ఉయ్యాలో
ఉన్నదమ్ము కోవాలి ఉయ్యాలో
అప్పు చేసి కట్టిన కాళేశ్వరం ఉయ్యాలో
కంట నీరు పెట్టించే ఉయ్యాలో
ఉచిత పథకాలు ఉయ్యాలో
ఉన్నోనికే అంద బట్టే ఉయ్యాలో
ధరణి తెచ్చి ఉయ్యాలో
పైసలు దండుకునే ఉయ్యాలో
భూములన్నీ ఉయ్యాలో
పాలకుల పాలాయే ఉయ్యాలో
రైతుల చేతిలో ఉయ్యాలో
భూములే లేక పాయె ఉయ్యాలో
బంగారు తెలంగాణ చేస్తననే ఉయ్యాలో
ఇనుప తెలంగాణ చేసే ఉయ్యాలో
చేసిన అప్పులన్నీ ఉయ్యాలో
ఎవ్వరు కట్టాలి ఉయ్యాలో
ప్రజలను ఉయ్యాలో
మీ సావు మీరు సావండని వైకుంఠ దామాలు కట్టే ఉయ్యాలో
మళ్ళీ ఓటు అడగబట్టే ఉయ్యాలో
ఓటెట్ల వేస్త ఉయ్యాలో
మీ ఇంటి లాగ ఉయ్యాలో
మా ఇల్లు లేదేమని అడుగుత ఉయ్యాలో
