Suryaa.co.in

Features

దుర్విని”యోగాధనం”!

ఇది “యోగ”మా..
ప్రయోగమా..
యాగమా..
ఆరోగ్యంతో సంయోగమా..
ప్రజాధనం దుర్వినియోగమా..!

ఇది “యోగ”మా..
జనాల విరాగమా..
నాయకుల సరాగమా..
పార్టీల సమాగమమా..
మోడీజీ ప్రచార రాగమా..!

ఇది “యోగ”మా..
జనాల్ని తరలించలేక
అధికార్ల కూనిరాగమా..
మోడీ..బాబు
అనురాగమా..

– సురేష్..9030296286

LEAVE A RESPONSE