Suryaa.co.in

Andhra Pradesh

పిడుగురాళ్ల మున్సిపాలిటీ అభివృద్ధికి కృషి

– గురజాల ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు

పిడుగురాళ్ల: మున్సిపాలిటీ వైస్ చైర్మన్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి చెందిన 30 వ వార్డు కౌన్సిలర్ ఉన్నం భారతి ని ఎన్నుకున్న‌ట్టు గురజాల శాసన సభ్యుడు ఎరపతినేని శ్రీనివాసరావు తెలిపారు. ఆయ‌న సోమ‌వారం ఏర్పాటు చేసిన విలేఖ‌ర్ల స‌మావేశంలో మాట్లాడారు. ఇందుకు సహకరించిన చైర్మన్ కి, కౌన్సిలర్ లకు కృతజ్ఞతలు తెలిపారు. అదేవిధంగా 15 మంది కౌన్సిలర్లు తెలుగుదేశం పార్టీలో చేరాలని వారిని పార్టీలోకి సాదరంగా ఆహ్వానిస్తున్నట్టు పేర్కొన్నారు.

రాజకీయాల్లో గెలుపు, ఓటమి సహజమని గడచిన అయిదేళ్ళ‌లో వీరు కౌన్సిలర్లుగా అధికార పార్టీలో ఉన్న తమ వార్డులకు నిధులు ఇవ్వాలని కోరడం చూశానని అన్నారు. కూట‌మి స‌ర్కారులో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ సహకారంతో ప్రతి వార్డులో మంచినీటి సౌకర్యం ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. పెండింగ్‌లో ఉన్న అన్ని పనులు పూర్తి చేస్తామని విధులు కూడా వచ్చాయని వెల్ల‌డించారు.

LEAVE A RESPONSE