Suryaa.co.in

Telangana

హామీలను అమలు చేసేందుకు కృషి

– పీఏసీ సమావేశంలో టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్

 

హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేస్తుంది. అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేసేందుకు కృషి చేస్తున్నాం. 6 గ్యారంటీలు ప్రజలకు ఇచ్చిన హామీలను అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుంచే అమలు చేసేందుకు కృషి జరుగుతుంది. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కె.సి వేణుగోపాల్ పీఏసీ సమావేశానికి రావడం చాలా సంతోషం.

ఆరు గ్యారంటీల అమలులో రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కృషికి ప్రజల నుంచి మంచి స్పందన ఉంది. ప్రియాంక గాంధీ పైన బీజేపీ నాయకులు చేసిన అనుచిత వ్యాఖ్యలు తీవ్రంగా ఖండిస్తూ నిరసనలు వ్యక్తం చేశారు.

అంబేద్కర్ విషయంలో అమిత్ షా చేసిన అవమానకర మాటలు దేశ వ్యాప్తంగా నిరసన వ్యక్తం అయింది. తెలంగాణ లో అన్ని ప్రాంతాలలో ఉద్యమాలు చేశారు. రాష్ట్రంలో రైతులకు రుణ మాఫీ, రైతు భరోసా, 500 రూపాయలు బోనస్ లాంటి అనేక పథకాలు అమలు చేసాము.

LEAVE A RESPONSE