– రెస్టారెంట్లలో 50 శాతం అదనపు ధరలు
– 15 శాతం పెరిగిన కోడిగడ్డు ధరలు
– స్టోర్లలో నో స్టాక్ బోర్డులు
– కోళ్ల ఉత్పత్తి పడిపోవడమే కారణమట
– ఫాఫం అమెరికన్లు..
ఒకవైపు ఇండియాలో బర్డ్‌ఫ్లూ భయంతో కోళ్ల ధర ఢామ్మని పడిపోతే.. మరోవైపు అందుకు విరుద్ధంగా, అమెరికాలో ఇప్పుడు కోడిగుడ్డు ధరలకు రెక్కలొచ్చాయి. 15 శాతం అదనపు ధర చెల్లిస్తేగానీ కోడి కూయడం లేదట. చివరాఖరకు స్టోర్లలో కూడా ‘కోడిగుడ్లు స్టాక్ లేదు. సారీ బ్రో.. పొమ్మంటున్నార’ట! దీనికంతటికీ కారణం అకకడ కోళ్ల ఉత్పత్తి తగ్గిపోవడమేనట. ఆ గత్తర కారణంగా.. గుడ్లతో తయారచేసే ప్రతి ఫుడ్డుపై రెస్టారెంట్లు 15 శాతం రేట్లు పెంచి వడ్డిస్తున్నారట. దీనితో కోడిగుడ్లతో బతికేద్దామనుకునే వారికి ఇది బ్యాడ్‌న్యూస్‌గా మారింది.
కోడిగుడ్ల ధర 45 ఏళ్ల గరిష్ఠ స్థాయికి చేరుకుందని సమాచారం. ఈ ఏడాదిలో ఇప్పటివరకు ధరలు 15 శాతం పెరిగాయని, రానున్న రోజుల్లో మరో 20 శాతం వరకు పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. కొన్ని స్టోర్లలో కొనుగోలుదారులకు ఒక్కొక్కరికి రెండు లేదా మూడు కోడిగుడ్ల ట్రేలను మాత్రమే విక్రయిస్తున్నారు. రెస్టారెంట్లు గుడ్డుతో చేసే వంటకాలపై 50 శాతం అదనపు ఛార్జీ విధిస్తున్నాయి.
గత ఏడాది జనవరిలో ఒక కోడిగుడ్డు ధర 2.52 డాలర్లు ఉండగా, డిసెంబర్ నాటికి అది 4.15 డాలర్లకు పెరిగింది. ప్రస్తుతం ఆ ధర 7.34 డాలర్లకు చేరుకుందని, ఇదే పరిస్థితి కొనసాగితే భవిష్యత్తులో ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది.
గుడ్ల ఉత్పత్తి తగ్గడంతో ధరలు పెరుగుతున్నాయి. దీంతో వినియోగదారులు ఎక్కువ మొత్తంలో కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతున్నారు.