– మాధవ్ 5సెట్లు నామినేషన్ దాఖలు
విజయవాడ: బీజేపీ రాష్ట్ర ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ సోమవారం ఇక్కడ ప్రారంభమైంది. ఇందులో భాగంగా అధ్యక్ష ఎన్నిక కు ఓటర్ల జాబితాలో ఉన్నస్టేట్ కౌన్సిల్ సభ్యులు హాజరును పరిశీలించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి కి పీవీఎన్ మాధవ్ అయిదు సెట్లు నామినేషన్ దాఖలు చేశారు. ఎన్నికల అబ్జర్వర్ ఎంపీ పీసీ మోహన్, ఎన్నికల అధికారి, రాజ్యసభ సభ్యుడు పాకా వెంకట సత్యనారాయణ లు ప్రతి ఒక్కరు హాజరు పరిశీలించారు.
జాతీయ సహా సంఘటనా ప్రధాన కార్యదర్శి శివ ప్రకాష్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి, కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ, ఎంపీ సీఎం రమేష్, జాతీయ కార్యవర్గ సభ్యుడు ఎమ్మెల్సీ సోము వీర్రాజు హాజరయ్యారు. ఎమ్మెల్యే లు బీజేపీ శాసనసభా పక్ష నేత పెన్మత్స విష్ణు కుమార్, డాక్టర్ పార్థసారథి, నల్లమిల్లి రామకృష్ణా రెడ్డి, ఎన్.ఈశ్వర రావు హాజరయ్యారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు సన్నారెడ్డి దయాకర్ రెడ్డి, గారపాటి సీతారామంజనేయ చౌదరి, బిట్ర శివన్నారాయణ, సాగి కాశీ రాజులు పర్యవేక్షించారు.