జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు – రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య ఆంధ్రప్రదేశ్ బీసీ సంఘం రాష్ట్ర అధ్యక్షులుగా విద్యానగర్ బీసీ భవన్ లో జరిగిన 20 కుల సంఘాల సమావేశంలో , విజయవాడ కు చెందిన డాక్టర్ ఎన్. మారేష్ ను నియమించారు. ఈ సందర్భంగా ఆర్. కృష్ణయ్య మాట్లాడుతూ, చట్టసభలలో బీసీలకు 50% రిజర్వేషన్లు వచ్చే సమయం కొద్ది దూరంలోనే ఉందన్నారు. బీసీలందరూ సంఘటితమై మరో స్వతంత్ర ఉద్యమంలా పోరాడాలని పిలుపునిచ్చారు.
బీసీ సంఘం రాష్ట్ర అధ్యక్షులుగా డాక్టర్ ఎన్. మారేష్ నియమించడం గురించి మాట్లాడుతూ గత 20 సంవత్సరాలుగా బీసీ సంఘంలో నిబద్ధతతో, చిత్తశుద్ధితో, అంకితభావంతో పనిచేస్తున్న వ్యక్తిని, ఉమ్మడి రాష్ట్రంలో బీసీ విద్యార్థి సంఘం అధ్యక్షులుగా బీసీ సంక్షేమ సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ గా పని చేసిన
అనుభవం ఉందన్నారు. 139 బీసీ కులాల పట్ల పూర్తి అవగాహన, బీసీల జీవనశైలి, వారి స్థితిగతులు తెలిసిన వ్యక్తని, బీసీ డిమాండ్ల పట్ల పూర్తి అవగాహన ఉన్న వ్యక్తి కాబట్టి అతడి సమర్థతను గుర్తించి ఆంధ్రప్రదేశ్ బీసీ సంఘం రాష్ట్ర అధ్యక్షులుగా నియమిస్తున్నట్లు నియామక పత్రం అందజేశారు.
ఈ సందర్భంగా డాక్టర్ ఎన్ మారేష్ మాట్లాడుతూ తన సమర్ధతను గుర్తించి రాష్ట్ర అధ్యక్షులుగా అవకాశం ఇచ్చినందుకు ఆర్ కృష్ణయ్య గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. బీసీ డిమాండ్ కోసం చిత్తశుద్ధితో కష్టపడతానని, చట్టసభలలో బీసీలకు 50% రిజర్వేషన్లు పోరాడి సాధించుకుంటామని, ఆంధ్ర ప్రదేశ్ లో అలుపెరగని పోరాటం చేస్తానని ఆర్ కృష్ణయ్య ఆశయ సాధనలో ముందుకు పోతామని తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో జాతీయ బి.సి సంక్షేమ సంఘం జాతీయ కన్వీనర్ గుజ్జ కృష్ణ, బి.సి యువజన సంఘం రాష్ట అద్యక్షులు నీల వెంకటేష్, జాతీయ బి.సి సంక్షేమ సంఘం జాతీయ అధికార ప్రతినిది కర్రి వేణుమాధవ్, బిసి ఐక్య వేదిక రాష్ట అద్యక్షులు జి.అనంతయ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పగిడాల సుధాకర్, బి.సి సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రచార కమిటీ చైర్మన్ జక్కు శ్రీనివాస్, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట అధికార ప్రతినిది ఎ.భాస్కరా చారి, భాస్కర్ ప్రజాపతి, బాలరాం తదితరులు పాల్గొన్నారు.