Suryaa.co.in

Telangana

పాతబస్తీలో అక్రమ మదర్సాలను తొలగించండి

-భాగ్యనగర్ జిల్లా బిజెపి అధ్యక్షులు సంరెడ్డి సురేందర్ రెడ్డి

పాతబస్తీలో అక్రమంగా వెలసిన మదర్సాలను తొలంగించాలని భాగ్యనగర్ జిల్లా బిజెపి అధ్యక్షులు సంరెడ్డి సురేందర్ రెడ్డి డిమాండ్ చేశారు. పాతబస్తీలో అక్రమంగా వెలసిన మదర్సాలను తొలగించాలని సౌత్ జోన్ డిసిపి సాయి చైతన్యకు సంరెడ్డి సురేందర్ రెడ్డి , సహదేవ్ యాదవ్, రూప్ రాజ్, నిరంజన్ యాదవ్, శ్రీకాంత్ రెడ్డి , కామాటి మహేష్ లు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..

పాతబస్తీలో ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా మదర్సాలను ఏర్పాటు చేసి విద్యార్థులో మతసామరస్యానికి వ్యతిరేకంగా బీటలు నాటుతున్నారని తెలిపారు. మదర్సాలు ఏర్పాటు చేయాలంటే కలెక్టర్, ఎమ్మార్వో, స్థానికుల అనుమతి తప్పనిసరి. కానీ ఎలాంటి అనుమతులు లేకుండా ఇష్టానుసారంగా ఏర్పాటు చేయడం చట్టానికి వ్యతిరేకమని వివరించారు. మాదన్నపేట్ పోలీసు స్టేషన్ పరిధిలో ఓ హిందు ఇల్లు కొనుగోళ్లు చేసి మదర్సాలను ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ మసీదు కు సంబంధించిన కార్యక్రమాలు కూడా జరగడంతో స్థానిక హిందు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. ఇలా పాతబస్తీలో ఇష్టానుసారంగా మదర్సాలు ఏర్పాటు చేయడం తగదని తెలిపారు. అనుమతులు లేని మదర్సాలను వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో పాతబస్తీలో భారీ ఎత్తున నిరసనలు చేపడుతామని హెచ్చరించారు.

LEAVE A RESPONSE