ఇప్పటి వరకు జరిగింది ఒక ఎత్తు… ఇకపై జరగబోయేది ఒక ఎత్తు

Spread the love

– వైఎస్ విజయమ్మ

షర్మిలమ్మ
తెలంగాణ కోడలుగా..
వైఎస్ఆర్ కూతురుగా..
వైఎస్ఆర్ టీపీ పెట్టింది…
తన వంతుగా తెలంగాణలో ఆమె ప్రయత్నం చేస్తుంది.
ఎల్లో మీడియాలో ఏదిబడితే అది రాస్తున్నారు.
ఎల్లో మీడియా అబద్ధాలు రాయడం దురదృష్టకరం.
ఇద్దరి పిల్లలకూ తల్లినే..
తెలుగువాడు గుండెచప్పుడు వైఎస్ఆర్
ఇప్పటి వరకు జరిగింది ఒక ఎత్తు…ఇకపై జరగబోయేది ఒక ఎత్తు.

ఏపీలో కంటే కూడా..తెలంగాణలో ముందుగానే ఎన్నికలు వస్తాయి. ఏపీ భవిష్యత్తు ప్రయోజనాల కోసం సీఎం జగన్‌కు కచ్చితంగా స్టాండ్ ఉంటుంది. తెలంగాణలో షర్మిలకు వేరువేరు విధానాలు ఉంటాయి. వైఎస్‌ఆర్ ఆశయాలు పునికిపుచ్చుకున్నవారు జగన్, షర్మిల.

నేను రాయని, చేయని సంతకంతో..రాజీనామా లేఖ విడుదల చేశారు. ఇవి జుగుప్సకర రాతలు. ఆ లేఖ చూసినప్పుడు చాలా బాధ వేసింది. నేను రాయని, నేను చేయని సంతకం ఉన్న లేఖను ఎలా రిలీజ్ చేస్తారు. నేను వైఎస్ఆర్‌ సీపీ నుంచి తప్పుకోవాలని అనుకుంటున్నా. అక్కడ షర్మిలకు అండగా ఉండాలని అనుకుంటున్నాను. నన్ను క్షమించమని వైఎస్ఆర్ అభిమానులను కోరుతున్నాను. రాజకీయం అంటే దుష్ప్రచారాలు, వెన్నుపోట్లు కాదు. వైఎస్ఆర్ లేని లోటును నాకు ఎవరూ తీర్చలేరు.

Leave a Reply