Suryaa.co.in

Political News

ఏం బిడ్డవో.. ఏం గడ్డవో.. ఒక్క పనికీ గతి లేదు!

‘కడప’ చించుకుంటే కాళ్లమీదపడతుందట!

జగన్ గారూ,

దశాబ్దాల పాటు మీ సందింటికి ఆధిపత్యాన్నిచ్చి కడప జిల్లా అండగా నిలిచింది. కానీ, ఒక్క పరిశ్రమ కూడా తీసుకురాలేకపోయారు. యురేనియం నుండి సిమెంటు పరిశ్రమలు తెచ్చి కాలుష్యంతో కడపను ఉక్కిరిబిక్కిరి చేశారు.
ఉన్న ఆల్విన్ కంపెనీ మూతపడినా పట్టించుకోలేదు. అయినా, కడప ప్రజలు భయంతో మీ ఆధిపత్యాన్ని మౌనంగా అంగీకరించారు. ఉప ఎన్నికల నుండి భారీ మెజారిటీలు వచ్చేలా, “మన గడ్డ బిడ్డ”, “రాజన్న బిడ్డ” అని 2019లో ఏకపక్షంగా గెలిపించారు.నిన్నటికి నిన్న జగన్ చేలాగాళ్లు అవును. కడప అడ్డ.. జగన్ బిడ్డ.. అని డైలాగులేశారు.

కానీ, మీరు ఆ కడప గడ్డకు స్టీల్ ప్లాంట్ నుండి బెంగళూరుకు రైల్వే మార్గం వరకు ఒక్క పని కూడా చేయలేని చవటగా చరిత్ర సృష్టించారు.

దీనికి తోడు, మీ నాయకులను భూముల మీదకు వదిలారు. పెద్దల సభ సభ్యుడు సింహభాగాన్ని, మీ సకల సలహాదారుణుడు రెండో సింహభాగాన్ని, బాబాయిని గొడ్డలితో చంపించిన గుండ్లవాగు.శంకర్ గాడి వరకు వాటాలు వేసుకొని కనిపించిన భూములన్నిటినీ కబ్జా చేశారు.

ఇందుకే కదా కడప జిల్లా నిశ్శబ్దంగా మీ పార్టీకి పాతర వేసింది! ఇలాంటివి తెలుసుకొని క్షమాపణలు చెప్పాల్సింది పోయి, “నేను వస్తా, బట్టలు ఊడదీస్తా” అని అంటుంటే ఇంకా మీకు బుద్ధి రాలేదు, ఈ జన్మకు రాదని మీ వైకాపాలోనే అనుకుంటున్నారు. 2029లో, మీరు, మీ గొడ్డలి బ్రదర్ బయట ఉంటే, కడప ఎంపీ, పులివెందుల ఎమ్మెల్యే స్థానాలను నిలుపుకుంటే అదే గొప్ప.

అయితే, ఇప్పుడు పరిస్థితులు మారాయి. పది రోజుల్లో కడపలో స్టీల్ ప్లాంట్ నిర్మాణం ప్రకటన రావడం, పనులు మొదలవ్వడం జరగబోతోంది. కడపలో బద్వేలు నుండి నెల్లూరుకు నిన్ననే కేంద్ర మంత్రివర్గం ద్వారా 4 వరుసల రాజమార్గ నిర్మాణం ప్రకటన ఆమోదించబడింది.

చదువుకోవడానికి, వైద్యానికి, ఉద్యోగాలకు, పనులకు, ప్రశాంతంగా బతకడానికి పొరుగు జిల్లాల బాట పట్టిన కడపకు, “మహానాడు” నుండి మంచి జరగబోతోంది. పురాణాలలో దేవుళ్ళు, రాక్షసులు ఇద్దరూ ఉండేవారు. కానీ, దేవుని గడపను తన పేరులో తీసేస్తే కడప బాధపడింది. ఇప్పుడు కడప పేరును మళ్ళీ చేర్చుకొని నిజమైన అభివృద్ధికి బాటలు వేసుకుంది.

మీ తండ్రి “అమ్మకు చీర పెట్టనివాడు పిన్నికి పట్టుచీర పెడతానన్నాడు” అని ఒక సామెత చెప్పేవారు. కడపకు ఏమీ చేయకుండా, భూములు కబ్జా చేసి ఏమి చేసుకుంటారు? ఎవరో ఒకరు వచ్చి అభివృద్ధి చేస్తారు అనే ఆశతోనా?

అభివృద్ధి మొదలైంది, కబ్జాలు కూడా స్వాధీనం చేసుకుంటారు. మీ ఆటవిక పనులు వెలికితీసి ఎప్పుడు శిక్షిస్తారా అని జనం ఎదురుచూస్తున్నారు. మీరేమో పొరుగున యలహంక ప్యాలెస్ లో పీడకలలు కని, భయంతో విమానం ఎక్కి తాడేపల్లిలో దిగి పగటికలలు కంటూ మేకపోతు గాంభీర్యం ఒలకబోస్తున్నారు.
మీ అరాచకానికి ప్రజాస్వామ్యంలో చోటు దక్కదు. ఐదేళ్ల మీ దుర్మార్గ పాలనతో చక్కటి, మరిచిపోలేని పాఠం నేర్పారు.

LEAVE A RESPONSE