(బాబు)
సజ్జల రామకృష్ణారెడ్డి తన కొడుకును ఒక పెద్ద ‘తురుమ్ ఖాన్’ లాగా, అనుచరగణంతో పంపించారు. ఈలోగా, సజ్జల రామకృష్ణారెడ్డి తాను బిజీగా ఉన్నట్టుగా నటిస్తూ, ఎస్పీ రెడ్డి అల్లుడైన సజ్జల శ్రీధర్ రెడ్డిని కలిశారు. ఆ సమావేశంలో జగన్ పేరు బయటపెట్టవద్దని తలశిల రఘురాంను వెంటబెట్టుకుని వెళ్ళారు.
సజ్జల కుమారుడి హంగామా చూసిన పోలీసులు, వెంట వచ్చిన వారిని తుప్పు పట్టిన గేటు బయట ఉండమని చెప్పి, అతన్ని మాత్రం లోపలికి వెళ్లమన్నారు. అతను బిక్కుబిక్కుమంటూ అక్కడే నిలబడ్డాడు.
లోపలికి వెళ్ళిన తర్వాత కూడా అతను సహకరించలేదు. దాంతో అధికారులు “మళ్ళీ పిలుస్తాం, వెళ్ళిపో” అని చెప్పి పంపించేశారు. వైసీపీ సోషల్ మీడియా ఇన్‌ఛార్జ్‌గా ఉన్న ఈ యువకుడు మధ్యాహ్నం 3 గంటలకు రమ్మంటే, పొద్దున్నే దిగాడు.
మొదట ఇచ్చిన నోటీసులను అతను ధిక్కరించి, తన తండ్రి పలుకుబడిని చూసుకొని సుప్రీంకోర్టుకు వెళ్ళాడు. అక్కడ ధర్మాసనం “నీ పోస్టుల ఉద్దేశ్యం మాకు అర్థం కాదనుకున్నావా?” అంటూ చివాట్లు పెట్టింది. అంతేకాదు, ట్రయల్ కోర్టుకు బుద్ధిగా హాజరు కావాలని గట్టిగా చెప్పింది.
దాంతో దెబ్బకు అతను ముందుగానే హడావుడిగా వచ్చేశాడు. రెండు వారాల పాటు అరెస్టు చేయవద్దని కోర్టు వెసులుబాటు కల్పించడంతో, పరారీ నుండి ఇలా బయటకు వచ్చాడు.
ఇతను కచ్చితంగా జైలుకు వెళ్లడం ఖాయం. అరెస్ట్ కొంచెం ఆలస్యం అయినా, ఇతని తండ్రి కూడా ఇతన్ని కాపాడలేడు. ఇతని వెనుక ఉన్న జగన్ అధికారాన్ని అండగా చేసుకుని అసభ్యకరంగా సోషల్ మీడియాను వాడినందుకు, బూతులు మాట్లాడి పీటీ వారెంట్లలో చిప్పకూడు తిని వచ్చిన పోసాని లాంటి వాళ్ల వీసీయోలను ఇతను ప్రచారం చేసిన కేసులు కూడా ఉన్నాయి. కాబట్టి, ఇతను కూడా పీటీ వారెంట్లలో మరింత సన్నబడటం ఖాయం.
ఇతన్ని నమ్మి అసభ్యకరమైన పోస్టులు పెట్టిన ‘పేటీఎంలు’ (5 రూపాయల కోసం పనిచేసే సోషల్ మీడియా కార్యకర్తలు) ఇప్పుడు వణికిపోతున్నారు.