(సూరజ్)
మావోయిస్టు పార్టీ కేంద్ర కార్యదర్శిగా గణపతి మరోసారి బాధ్యతలు స్వీకరిస్తున్నారు? ప్రస్తుత పరిస్థితుల్లో ఆయన నాయకత్వమే శరణ్యం అని సానుభూతిపరులు అంటున్నారు! అనారోగ్యం వల్ల గణపతి @ ముప్పాళ లక్ష్మణ్ రావు 2018 లో ఆ పదవి నుంచి తప్పుకున్నారు.
మొన్న భద్రతా బలగాల కాల్పుల్లో మరణించిన నంబళ్ల కేశవరావు.. గణపతి వారసుడుగా పగ్గాలు చేపట్టారు. ప్రవేశానికి దుర్భేద్యం, మావోయిస్టులకు కేంద్రస్థావరంగా ఉన్న అబూజ్మాడ్ లోకి భద్రతా బలగాలు చొచ్చుకుపోయి కాల్పులకు దిగిన తరుణంలో పటిష్టమైన వ్యూహ రచన చేయగలిగిన నాయకత్వం అవసరం అన్న అభిప్రాయం ఉన్నట్లు వినికిడి.
కొత్త రక్తాన్ని నింపి ఉద్యమానికి జవసత్వాలు నింపాలంటే మంచి వ్యూహకర్త కావాలనే భావన వాళ్లలో ఉంది. ఆపరేషన్ కగార్ ను నిర్వహిస్తూ 2026 మార్చికల్లా నక్సల్ ముక్త్ భారత్ ను తయారు చేస్తామన్నది కేంద్రం ప్రతిజ్ఞ.
ఛత్తీస్ ఘడ్ లోని బస్తర్ జిల్లాను నక్సల్ రహిత ప్రాంతంగా ప్రకటిస్తూ, దాన్ని ఎల్డబ్ల్యూఈ ఏరియా జాబితాను నుంచి తొలగించారు. అనుభవం ఉన్న నేత అవసరంలో భాగంగా, మల్లోజుల వేణుగోపాల్, మోడెం బాలకృష్ణలను కాదని, ముప్పాళ లక్ష్మణ్ రావు @ గణపతి వైపే, ఆ పార్టీ మొగ్గు చూపినట్లు వార్త.