Suryaa.co.in

Andhra Pradesh

అమరావతిలో ఎనర్జీ, సైబర్ రెసిలెన్స్ సెంటర్

– పట్టువదలని విక్రమార్కుడు లోకేష్

గుర్తుందా.. డాడ్ తో దావోస్ వెళ్లినా.. ట్రాఫిక్ జామ్ లో.. చేరుకోలేమని ఇంకా తెల్లవారని మంచులో వడివడిగా నడిచిన లోకేష్.

ఫోటోలు దిగామా వచ్చామా అని కాకుండా.. నెలల తరబడి వర్కౌట్ చేశారు. ముందుకు తీసుకువెళుతున్నారు.

ఆంధ్రప్రదేశ్‌లో ప్రపంచ ఆర్థిక వేదిక (WEF) తో కలిసి “ఎనర్జీ మరియు సైబర్ రెసిలెన్స్” సెంటర్ ఏర్పాటు – అసలు దీని ప్రత్యేకత ఏంటి?

భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా, ప్రపంచ ఆర్థిక వేదిక (WEF) భాగస్వామ్యంతో ఆంధ్రప్రదేశ్‌లో “సెంటర్ ఫర్ ఫోర్త్ ఇండస్ట్రియల్ రివల్యూషన్ (C4IR)” నెట్‌వర్క్ కింద ఎనర్జీ మరియు సైబర్ రెసిలెన్స్ కోసం ఒక ప్రత్యేక థీమాటిక్ సెంటర్ ఏర్పాటు కానుంది.

అమరావతిలో ఇది కార్యరూపం దాల్చనుంది.

WEF యొక్క C4IR నెట్‌వర్క్ క్రింద ఎనర్జీ, సైబర్‌ సెక్యూరిటీ ఆవిష్కరణలపై దృష్టి సారించే ఇది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యొక్క స్వర్ణాంధ్ర విజన్ 2047 కు అనుగుణంగా, క్లీన్ ఎనర్జీ, AI, మరియు సైబర్‌ సెక్యూరిటీ రంగాలలో రాష్ట్రాన్ని ప్రపంచ పటంలో నిలబెట్టే దిశగా శ్రీకారం చుట్టారు.

ఈ కేంద్రం గ్రీన్ ఇండస్ట్రీలను అభివృద్ధి చేయడం, AI-ఆధారిత పాలనను ప్రోత్సహించడం, మరియు సుస్థిర సాంకేతికతలను పైలట్ ప్రాజెక్టులుగా అమలు చేయడంపై దృష్టి సారిస్తుంది.

ఎనర్జీ, స్మార్ట్ గ్రిడ్‌లు, AI వ్యవసాయం, పాలనలో పైలట్ ప్రాజెక్టులను నిర్వహించడంతో పాటు, అభివృద్ధి చెందుతున్న సైబర్‌ సెక్యూరిటీ టెక్నాలజీలలో యువతకు శిక్షణ ఇవ్వడం ఈ కేంద్రం ప్రధాన లక్ష్యం.

ఈ కేంద్రం కార్యకలాపాలకు రాష్ట్ర ప్రభుత్వం మూడేళ్ల కాలానికి రూ. 36 కోట్లు మంజూరు చేసింది. దీని కార్యకలాపాలు ప్రారంభంలోనే అమరావతి నుండి సాగుతాయి.

దావోస్‌లో జరిగిన సమావేశాలు ఈ సహకారానికి పునాదులు వేయగా, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ పెట్టుబడులు, ఆవిష్కరణలను ప్రోత్సహించే లక్ష్యంతో దీనిని ముందుకు నడిపించారు.

యువతకు అపార అవకాశాలు లభించేలా చెయ్యడం, మన రాష్ట్రంను ప్రపంచ స్థాయిలో నిలబెట్టడం దీని లక్ష్యాలు.

ఇన్నాళ్లు అయినా మరిచిపోకుండా వెంటబడి ఆ సహకారాన్ని సాకారం చేసిన పట్టుదల నాయుడి నుండి అబ్బాయికి వచ్చింది.

LEAVE A RESPONSE