ఎర్రబెల్లి దయాకర్‌రావు .. ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ!

షూటింగ్ బాల్ ఆటల పోటీలను ప్రారంభించిన మంత్రి
క్రీడాకారులను పరిచయం చేసుకున్న మంత్రి ఎర్రబెల్లి

రాష్ట్ర స్థాయి 41వ జూనియర్ షూటింగ్ బాల్ పోటీలను మహబూబాబాద్ జిల్లా పాలకుర్తి నియోజకవర్గం తొర్రూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆవరణలో ప్రారంభించిన రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచి నీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు . ఈ సందర్భంగా తన రాజకీయ జీవితంలో 40 ఏండ్ల ప్రస్థానం పూర్తి అయి 41వ ఏడాది నడుస్తున్న సందర్భంగా తన అభిమానులు ఏర్పాటు చేసిన కేక్ కట్ చేసిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు .

ఈ సందర్భంగా మంత్రి దయాకర్‌రావు ఏమన్నారంటే…
ఈ రోజు రాష్ట్ర స్థాయిలో 41 వ జూనియర్ షూటింగ్ బాల్ క్రీడలను నిర్వహిస్తున్నందుకు అందరికి అభినందనలు. షూటింగ్ బాల్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు మంగళపల్లి శ్రీనివాస్, క్రీడల కన్వీనర్ పొనుగోటి సోమేశ్వర్ రావు, మున్సిపల్ చైర్మన్ మంగళపల్లి రాంచంద్రయ్య, షూటింగ్ బాల్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి చెడుపల్లి అయిలయ్య ఇతర నిర్వాహకులకు, పోటిలో పాల్గొంటున్న క్రీడాకారులకు నా శుభాకాంక్షలు.

ఈ క్రీడ 1956 వ సంవత్సరం లో ప్రారంభించబడినది. ఈ క్రీడ 1972 సంవత్సరంలో ఫెడరేషన్ గా ఏర్పడినది.1976లో మొదటి జాతీయ ఛాంపియన్‌షిప్ పోటీలు న్యూ ఢిల్లీలో జరిగినవి.భారతimage-5 షూటింగ్‌బాల్ సమాఖ్య 1985 సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వంచే గుర్తించబడింది.ఇటీవల షూటింగ్‌ బాల్ క్రీడను కేంద్ర ప్రభుత్వం ఏక్ భారత్ శ్రేష్ట్ భారత్ మరియు ఫిట్ ఇండియా కార్యక్రమంలో చేర్చినారు.

షూటింగ్ బాల్ క్రీడా అన్నది 90 శాతం గ్రామీణ ప్రాంతంలోని క్రీడాకారులు ఆడుతూ ఉన్నారు.షూటింగ్ బాల్ ఆడటం వల్ల దేహ దారుఢ్యం తో పాటు మానసిక ఉల్లాసం కలుగుతుంది.ఈ ఆటను వయస్సుతో నిమిత్తం లేకుండా ఆడుతారు.ఈ క్రీడను దేశ వ్యాప్తంగా మధ్య తరగతి క్రీడాకారులు ఎక్కువగా ఆడుచున్నారు. దక్షిణ భారత దేశం కన్న ఉత్తర భారత దేశంలో ఎక్కువగా ఆడుచున్నారు.ఈ మధ్యకాలంలోనే ఈ క్రీడకు దక్షిణ భారతదేశంలో, తెలంగాణలో ప్రాచుర్యం వచ్చింది. ఈ క్రీడను విస్తరించి క్రీడాకారులను ప్రోత్సహించాలి.

ఈ క్రీడ ద్వారా పొందే సర్టిఫికేట్, విద్యా, ఉద్యోగాలలో ఉపయోగ పడుతుంది. ప్రభుత్వ ఉద్యోగాలలో 2% రిజర్వేషన్ ఉంటుంది.ప్రస్తుతం నిర్వహిస్తున్న 41వ జూనియర్ బాలబాలికల షూటింగ్ బాల్ క్రీడా పోటీలలో రాష్ట్రంలోని 33 జిల్లాల నుండి 800 మంది క్రీడాకారులు పాల్గొంటున్నారు.

100 మంది కోచ్ లు, మేనేజర్లు మరియు అధికారులు పాల్గొన్నారు.రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ క్రీడను ప్రోత్సహిస్తున్నది.రాష్ట్ర వ్యాప్తంగా 47 క్రీడా స్టేడియాలను నిర్మించడంతో పాటు ప్రతి నియోజకవర్గానికి ఒకటి నిర్మించి అండగా నిలవడం గర్వకారణం.మన ప్రభుత్వం క్రీడలను క్రీడాకారులను ప్రోత్సహించడానికి నిదర్శనం నిఖత్ జరీన్ మొన్న జరిగిన కామన్ వెల్త్ గేమ్స్ లో బంగారు పతకం సాధించడం మనకు గర్వకారణం.రాష్ట్ర స్థా నుండి జాతీయ స్థాయిలో రాణించేవిధంగా మీరు అందరు కష్టపడి సాధించాలి. ఇందుకు ప్రభుత్వ సహకారం ఉంటుంది. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్, అధికారులు, క్రీడాకారులు, ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply