Suryaa.co.in

Features

చావుతో చెలిమి..!

తుళ్ళి పడే చిన్న వయసులోనే
తుపాకులు నాటిన
విప్లవ కర్షకుడు..
తిరుగుబాటు వైతాళికుడు..
మరణానికి వెరవక ఉరికొయ్యనే ముద్దాడిన
వీర సైనికుడు..
నమ్మిన సిద్ధాంతం కోసం
ప్రాణాన్ని తృణప్రాయంగా
సమర్పించిన
భగత్ సింగమతడు..!

స్వతంత్ర సమరంలో
ఒక్కొక్కరిది ఒక్కో పంథా..
భగత్ సింగుకైతే
ఆయుధమే శరణమైంది అన్యధా..
తుపాకీ పట్టడమే శతధా..
తెగువే అస్త్రమైంది సహస్రధా!

అనుకుంటే
ముందుకు అడుగే..
ఆ అడుగు
ముందుకేస్తే పిడుగే
కయ్యానికి దువ్వే కాలు
తుపాకీ ట్రిగ్గర్ పై వేలు..
అదే తెలిసిన రీతి..
తెలియనే తెలియదు భీతి!

తెల్లారితే ఉరి..
బతుకు ఆ రోజుతో సరి..
అప్పటికి వయసు
ఇరవై నాలుగు..
చంపేటప్పుడు
ఎంత ఆవేశమో
అంతే ఆవేశంతో చేశాడు
ప్రాయోపవేశం..!
తలారి దైర్యం ముర్థాబాద్..
వీర భగత్ నోట
ఇంక్విలాబ్ జిందాబాద్..!
నూగు మీసాల బుడతడు
చివరి శ్వాస పీల్చే వేళ..
జైలు గోడల నడుమ
విరబూసింది స్వరాజ్య కళ!!

– ఎలిశెట్టి సురేష్ కుమార్
9948546286

LEAVE A RESPONSE