– డీహెచ్ఎల్ సీఈవో పాబ్లో సియానోతో మంత్రి లోకేష్ భేటీ
దావోస్: అంతర్జాతీయస్థాయి లాజిస్టిక్స్ సంస్థ డీహెచ్ఎల్ సీఈవో పాబ్లో సియానోతో మంత్రి నారా లోకేష్ దావోస్ బెల్వేడేర్ లో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ… భారత్ కార్గో ట్రాఫిక్ లో 16.5 శాతం వాటా కలిగి ఆంధ్రప్రదేశ్ మూడో అతిపెద్ద రాష్ట్రంగా ఉంది. 35.77 మిలియన్ టన్నుల కార్గ్గో హ్యాండ్లింగ్ తో విశాఖపట్నం పోర్టు దేశంలోనే అతిపెద్ద పోర్టుగా ఉంది. కీలకమైన గంగవరం, కాకినాడ, రవ్వ, కృష్ణపట్నం వంటి కీలక ఓడరేవులు, ఇండస్ట్రియల్ హబ్ లు, వేర్ హౌస్ లు, కోల్డ్ స్టోరేజిలు కలిగిన ఆంధ్రప్రదేశ్ లో కనెక్టింగ్ మెర్క్స్ ఏర్పాటుచేయాలని విజ్థప్తి చేశారు.
దేశీయ, అంతర్జాతీయ సరుకుల కోసం ఆంధ్రప్రదేశ్ లో ఎయిర్ కార్గో (డీహెచ్‌ఎల్ ఏవియేషన్/ డీహెచ్‌ఎల్ ఎక్స్‌ప్రెస్) విస్తృతం చేసి, ఆంధ్రప్రదేశ్ నుండి ఉద్యానవన, ఇతర ఆహార ఉత్పత్తుల ఎగుమతి సౌకర్యాలను అభివృద్ధి చేయండి. ఏపీలో లాజిస్టిక్ కార్యకలాపాలను మెరుగుపర్చేందుకు బిజినెస్ సెంటర్ ఏర్పాటు చేయండి.
ఏఐ ట్రాన్హఫార్మేషన్, డిజిటలైజేషన్ ద్వారా వచ్చిన మార్పులకు అనుగుణంగా నైపుణ్యంగల వర్క్ ఫోర్స్ ను రూపొందించడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో కలిసి స్కిల్ డెవలప్ మెంట్, రిసోర్స్ సెంటర్ల ఏర్పాటులో భాగస్వామ్యం వహించాలని మంత్రి లోకేష్ కోరారు.
డిహెచ్ఎల్ సిఇఓ పాబ్లో సియానో మాట్లాడుతూ… రాబోయే అయిదేళ్లలో లాజిస్టిక్స్ పై 250 మిలియన్ డాలర్లు పెట్టుబడి పెట్టాలని భావిస్తున్నాం. వచ్చేమూడేళ్లలో ఉపరితల మౌలిక సదుపాయాలకు సంబంధించి 10 మేజర్ మెట్రోపాలిటన్ హబ్ లు ఏర్పాటు చేయాలని నిర్ణయించాం. ఏపీ ప్రభుత్వ ప్రతిపాదనలపై సంస్థ ఎగ్జిక్యూటివ్ లతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు