క్వాంటం ఫిజిక్స్ వంటి క్లిష్టమైన అంశాన్ని సామాన్యుల ముంగిటకి చేర్చినందుకు గాను మొత్తం ఏడు నగరాలకు ఈ ప్రతిష్టాత్మక పురస్కారాలు లభించాయి. 2026, ఫిబ్రవరి 11న ఘనాలోని అక్రాలో ఈ అవార్డులను ప్రకటించారు.
గ్లోబల్ విజేతలు
పుటిగ్నానో, ఇటలీ (ప్రథమ బహుమతి)
ఈ నగరం తన 600 ఏళ్ల నాటి కార్నివాల్ సంప్రదాయాన్ని సైన్స్‌తో ముడిపెట్టింది. కాగితం గుజ్జుతో అద్భుతమైన భారీ విగ్రహాలను రూపొందించి, వాటి ద్వారా క్వాంటం ఎంటాంగిల్‌మెంట్ మరియు ష్రోడింజర్ పిల్లి వంటి సిద్ధాంతాలను వీధి వీధినా ప్రదర్శించింది. ఇది ఒక ఓపెన్-ఎయిర్ సైన్స్ మ్యూజియంలా మారిపోయింది.
అలా మీన్ సిటీ, ఈజిప్ట్ (ద్వితీయ బహుమతి):
విద్యార్థుల నేతృత్వంలో “గతం మరియు భవిష్యత్తు” అనే థీమ్‌తో భారీ ఎడ్యుకేషన్ డ్రైవ్ నిర్వహించారు. రోడ్లపై వెళ్లే సామాన్య ప్రజలను పలకరించి, ఆటల ద్వారా క్వాంటం టెలిపోర్టేషన్ వంటి అంశాలను వివరించారు. ఈ ప్రదర్శన సుమారు 750 మందికి పైగా స్థానికులను మరియు పర్యాటకులను ఆకట్టుకుంది.
ఖండాల వారీగా ఉత్తమ నగరాలు
ఆసియా – ఒసాకా, జపాన్
ఒసాకా నగరం విద్యా రంగంలో విప్లవం సృష్టించింది. దాదాపు 1,700 పాఠశాలల్లోని 8 లక్షల మంది విద్యార్థులకు క్వాంటం విజ్ఞానాన్ని వివరించే పోస్టర్లను పంపిణీ చేసింది. అంతేకాకుండా, ఒసాకా ఎక్స్పో 2025 వేదికగా సామాన్యులు కూడా వాడగలిగేలా రిమోట్ క్వాంటం కంప్యూటింగ్ పోర్టల్‌ను అందుబాటులోకి తెచ్చింది.
నార్త్ అమెరికా – అర్బానా-ఛాంపెయిన్, అమెరికా
ఇక్కడి పబ్లిక్ లైబ్రరీలో ప్రత్యేకంగా ఒక క్వాంటం నెట్వర్క్ నోడ్‌ను ఏర్పాటు చేశారు. లైబ్రరీకి వచ్చే సాధారణ పౌరులు కూడా క్వాంటం రాండమ్ నంబర్లను జనరేట్ చేయడం మరియు బెల్ టెస్ట్ వంటి ప్రయోగాలు స్వయంగా నిర్వహించే అవకాశం కల్పించారు.
సౌత్ అమెరికా – పారాటీ, బ్రెజిల్
సైన్స్‌ను కళాత్మకంగా ఆవిష్కరించడంలో ఈ నగరం ముందు నిలిచింది. “ఎంటాంగిల్డ్ పెర్స్పెక్టివ్స్” పేరుతో ఫోటోగ్రాఫర్లు మరియు భౌతిక శాస్త్రవేత్తలు కలిసి ఒక అద్భుతమైన ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు. కాంతి యొక్క కణ-తరంగ ద్వంద్వ స్వభావాన్ని (Wave-particle duality) ఫోటోల రూపంలో చూపడం దీని ప్రత్యేకత.
ఆఫ్రికా – అలామీన్ సిటీ, ఈజిప్ట్
గ్లోబల్ స్థాయిలో రెండో స్థానంలో నిలవడమే కాకుండా, ఆఫ్రికా ఖండం నుండి అత్యుత్తమ నగరంగా ఈ నగరం ఎంపికైంది. ప్రజా బాహుళ్యంలోకి సైన్స్‌ను తీసుకెళ్లడంలో ఇది ఒక రోల్ మోడల్‌గా నిలిచింది.
యూరప్ – పుటిగ్నానో, ఇటలీ
ప్రపంచ విజేతగా నిలిచిన ఈ నగరం, ఐరోపా ఖండం పరంగా కూడా అగ్రస్థానాన్ని దక్కించుకుంది. సాంప్రదాయ కళలకు శాస్త్రీయ మెరుగులు దిద్దడం ఎలాగో ఈ నగరం ప్రపంచానికి నేర్పింది.
ఈ నగరాలన్నీ సాధించిన ఒకే ఒక్క పెద్ద విజయం ఏమిటంటే.. సైన్స్ అనేది కేవలం క్లాస్ రూమ్స్ మరియు ల్యాబ్స్ లో మాత్రమే ఉండేది కాదని, అది మన దైనందిన జీవితంలో ఒక భాగమని నిరూపించడం.
మన అమరావతి క్వాంటం వ్యాలీ కూడా ప్రపంచ పటంలో తన దైన ముద్రవేసే రోజులు ముందున్నాయి.