– ఆర్టీసీ బస్సు సర్వీసులు లేక 10 గ్రామలు ప్రజల అగచాట్లు
– మూడేళ్ల క్రితం కూలిన వంతెన
– ఇనుప రేకులతో రిపేర్లు చేస్తారా?
– పాలకులకు పట్టని మొవ్వ మండల ప్రజల కష్టాలు
మొవ్వ: అంగట్లో అన్ని ఉన్న అల్లుడు నోట్లో శని సందంగా కృష్ణాజిల్లాలోని మొవ్వ మండలంలోని పలు గ్రామాల ప్రజలు ఆర్టీసీ బస్సుల సర్వీసులు లేక నానా అవస్ధలు పడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల స్త్రీశక్తి పధకాన్ని ప్రారంభించి మహిళలకు ఆర్టీసీ బస్సు ఉచితంగా ప్రయాణం చేసే అవకాశాన్ని కల్పించి నా ఉపయోగించుకోలేని పరిస్థితి.
ప్రధానంగా మొవ్వమండల కేంద్రం నుంచి వయా కూచిపూడి మీదుగా నిడుమోలు మచిలీపట్నం వెళ్లే వైపు రహదారి ఆర్టీసు బస్సు సర్వీసులు లేక, సుమారు 10 గ్రామాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. గతంలో మచిలీపట్నం డిపో నుండి పెదముత్తేవి, ఐనంపూడి, ఘంటసాల, శ్రీకాకుళం, మొవ్వ కాలేజీ బస్సు, ఐలూరు తదితర గ్రామాలకు ఆర్టీసీ బస్సులు రాకపోకలు కొనసాగించేవి. గతంలో నష్టాల పేరుతో మచిలీపట్నం ఆర్టీసీ డిపో ఈ సర్వీసులను నిలిపివేయడం జరిగింది.
తర్వాత కొద్ది రోజులుకే మొవ్వ కు డిగ్రీ, జూనియర్ కాలేజీకి విద్యార్థుల సౌకర్యం కోసం ప్రత్యేక కాలేజీ బస్సు నడిపించడం జరిగింది. ఆర్టీసీ బస్సు సర్వీసులు లేకపోవడంతో దాదాపు 10 గ్రామాలకు చెందిన గ్రామస్తులు మహిళలు , కళాశాలు, పాఠశాల విద్యార్ధులు ప్రయాణం చేయకపోతున్నారు. ప్రభుత్వం సమస్యను గుర్తించి ఆర్టీసు బస్సు సర్వీసులు పునరుద్దించాలని ప్రజలు కోరుతున్నారు.
గత మూడు సంవత్సరాల క్రితం మండలంలో చినుముత్తేవి గ్రామంలో అయినంపూడి డ్రైనేజీ పై ఉన్న వంతెన కూలి పోయింది. ఇదే రూట్ లో చినుముత్తేవి గ్రామ స్మశానం వద్ద గేదెల కోడు డ్రైయినేజీ శిథిలావస్త కి చేరి, దెబ్బతిని కూలి పోవడానికి సిద్ధంగా ఉంది. గత ప్రభుత్వం, ప్రస్తుత ప్రభుత్వం ప్రజా ప్రతినిధులకు, అధికారులకు గ్రామస్తులు, పలు రాజకీయ పార్టీలు ఇతర ప్రచార మాధ్యమాల ద్వారా ప్రభుత్వాన్నికి వినతలు అందాయి.
దీంతో వంతెనపై గత సంవత్సరం కింద ఇనుప రేకులను తాత్కాలికంగా ఏర్పాటు చేశారు. భారీ వాహనాలకు అవకాశం లేకుండా చేయడంతో, ఆర్టీసీ బస్సు రాకపోకలు నిలిచిపోవడం జరిగినది. ఈ సమస్య కూడా పరిష్కరించి నూతన వంతెనలు నిర్మించాలని ప్రజలు కోరుతున్నారు