– పార్టీకి కార్యకర్తలే అసలైన బలం ప్రతి కార్యకర్త బాధ్యతగా పని చేయాలి
– బీసీ సంక్షేమ చేనేత జౌళి శాఖ మంత్రి సవిత
గోరంట్ల :గ్రామ స్ధాయిలో తెలుగుదేశం పార్టీ (టిడిపి) బలోపేతం చేసేందుకు కమీటీల నిర్మాణం అత్యవసరమని మంత్రి సవిత అన్నారు.గోరంట్ల తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మండల టీడీపీ,నాయకులు, కార్యకర్తలతో సమావేశం నిర్వహించి గ్రామ స్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేయడంలో కుటుంబ సాధికార సారధుల నియామకం ఎంత ముఖ్యమో వివరించారు.
ఏప్రిల్ 15వ తేదీ లోపు కుటుంబ సాధికార సారధుల నియామకం పూర్తి చేయాలని అని తెలిపారు. పార్టీ బలోపేతానికి గ్రామ స్థాయి నుంచి మండల స్థాయికి వ్యూహాత్మకంగా కార్యాచరణ రూపొందించాలని సవితమ్మ అన్నారు .”పార్టీకి కార్యకర్తలే అసలైన బలం. స్థానికంగా టిడిపి మరింత బలోపేతం కావాలంటే, ప్రతి ఒక్కరు తమ బాధ్యతను నిర్వర్తించాలి. ప్రతి గ్రామంలోనూ, ప్రతి బూత్ స్థాయిలోనూ టిడిపి శ్రేణులు సమర్థవంతంగా పని చేయాలని కోరారు.
“కుటుంబ సాధికార సారధుల నియామకం ద్వారా గ్రామ స్థాయిలో మరింత బలమైన నేతలను సమకూర్చుకోవాలన్నారు. ప్రభుత్వ ఫలాలను ప్రజల్లోకి తీసుకెళ్లే బాధ్యత మనపై ఉందని, ప్రతి కార్యకర్త ప్రజల సమస్యలను అధ్యయనం చేసి వాటి పరిష్కారానికి కృషి చేయాలన్నారు. గ్రామంలో ఏవైనా సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకురావాలని మంత్రి సవితమ్మ తెలిపారు .ఈ కార్యక్రమంలో సత్య సాయి జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కొల్లకుంట అంజనప్ప మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు..