– కావలి శాసనసభ్యులు దగుమాటి వెంకట కృష్ణారెడ్డి
కావలి: నమ్మి ఓటేసి తనను ఎమ్మెల్యే చేసిన ప్రజల సమస్యలు తీర్చడమే ధ్యేయమని కావలి శాసనసభ్యులు దగుమాటి వెంకట కృష్ణారెడ్డి తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా “సమస్య మీది పరిష్కారం నాది” అనే నినాదంతో “ఇంటింటికీ ఎమ్మెల్యే” అనే కార్యక్రమానికి గురువారం ఆయన శ్రీకారం చుట్టారు.
ఈ కార్యక్రమంలో భాగంగా కావలి పట్టణంలోని 35 వ వార్డులో ఆయన పర్యటించారు. వార్డులోని ప్రతి వీధిలో పర్యటించిన ఆయన ప్రజల నుండి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అప్పటికప్పుడు తీర్చగల సమస్యలను తక్షణమే పరిష్కరించారు. దెబ్బతిన్న రోడ్లకు మరమ్మత్తులను వెంటనే చేపట్టాలని అధికారులను ఆదేశించారు. నీటికి ఇబ్బందులు పడుతున్న వార్డులోని ఒక ప్రాంతానికి రూ.23 లక్షలతో మంచినీటిని అందిస్తానని హామీ ఇచ్చారు. కొత్తగా చేపట్టవలసిన సిమెంట్ రోడ్లకు నిధులు మంజూరు చేయిస్తానని తెలిపారు.
ఈ కార్యక్రమంలో కావలి ఆర్డీవో సన్నీ వంశీకృష్ణ, తహసీల్దార్ శ్రావణ్ కుమార్, మున్సిపల్ డిఈ సాయి రాం, వివిధ శాఖల అధికారులు, టీడీపీ పట్టణ అధ్యక్షులు గుత్తికొండ కిషోర్ బాబు, ప్రధాన కార్యదర్శి జ్యోతి బాబురావు, రాష్ట్ర కార్యదర్శి మలిశెట్టి వెంకటేశ్వర్లు, స్థానిక వార్డు నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు..