Suryaa.co.in

Andhra Pradesh

తోపుదుర్తి ప్రకాష్ రెడ్డిపై కేసు నమోదు

– వైసీపీకి మరో దిమ్మతిరిగే షాక్!
– కీలక నేతపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు
– హెలిప్యాడ్ వద్ద ఘటనకు ప్రధాన కారణం ప్రకాష్ రెడ్డే
– డీఎస్పీ నివేదికతో కలకలం!

రాప్తాడు: మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డిపై రామగిరి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు అయ్యింది. వైసీపీ కార్యకర్తల తోపులాటలో గాయపడిన కానిస్టేబుల్ నరేంద్ర కుమార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ప్రకాష్ రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు. హెలీప్యాడ్ వద్ద ఏర్పాటు చేసిన బ్యారికేడ్లు సరిగా లేవని ప్రకాష్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదని పోలీసులు తెలిపారు.

హెలీప్యాడ్ నిర్వహణ సరిగా లేదని తోపుదుర్తి ప్రకాష్ రెడ్డికి డీఎస్పీ స్వయంగా చెప్పారు. అయితే హెలీప్యాడ్ దగ్గరకు కార్యకర్తలు అందరూ వెళ్లాల్సిందేనని తోపుదుర్తి పట్టుకున్నారు. డీఎస్పీతో హెలీప్యాడ్ వద్ద ప్రకాష్ రెడ్డి వాగ్వాదానికి దిగినట్లు పోలీసులు తెలిపారు. ప్రకాష్ రెడ్డి కార్యకర్తలను రెచ్చగొట్టడంతోనే జగన్ హెలికాప్టర్‌లో బారికెడ్లు తోసుకొని కార్యకర్తలు లోపలికి వచ్చినట్లు గుర్తించారు. ఆ సమయంలో కార్యకర్తలకు పోలీసులకు మధ్య తోపులాట జరుగగా.. ఇందులో కానిస్టేబుల్ నరేంద్ర కుమార్‌కు గాయాలయ్యాయి.

కానిస్టేబుల్ నరేంద్ర కుమార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ప్రభాకర్ రెడ్డిపై రామగిరి పోలీసులు కేసు నమోదు చేశారు. హెలీప్యాడ్ దగ్గర బారికేడ్లు సరిగ్గా ఏర్పాటు చేయలేదని, నిర్వహణ సరిగా లేదని పలుమార్లు పోలీసులు చెప్పినా తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి పట్టించుకోని కార్యకర్తలందరూ హెలికాప్టర్ దగ్గరికి దూసుకొచ్చారని పోలీసులు తెలిపారు.

హెలిప్యాడ్ నిర్వహణ సరిగా లేకపోవడం, కార్యకర్తలను రెచ్చగొట్టి హెలిపాడ్ దగ్గరకు తీసుకెళ్లడం, పోలీసులతో వాగ్వాదానికి దిగిన కారణంగా పోలీసులు తోపుదుర్తి ప్రకాష్ రెడ్డిపై కేసు నమోదు అయ్యింది.

కాగా.. రెండు రోజుల క్రితం రాప్తాడు నియోజకవర్గంలో జరిగిన రెండు జగన్.. ఇటీవల హత్యకు గురైన లింగమయ్య కుటుంబాన్ని పరామర్శించారు. అయితే జగన్ పర్యటన సందర్భంగా కుంటిమద్ది వద్ద హెలిప్యాడ్‌ను ఏర్పాటు చేశారు. ఆ సమయంలో వందలాది మంది కార్యకర్తలు దూసుకురావడంతో తోపులాట చోటు చేసుకుంది.

అయితే హెలీప్యాడ్ వద్ద జరిగిన తోపులాట మొత్తానికి కారకుడు తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి అంటూ పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ కోరిక తోపులాటలో గాయపడిన కానిస్టేబుల్ నరేంద్ర కుమార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ప్రకాష్ రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు.

హెలీప్యాడ్ నిర్వాహణ సరిగా లేదని డీఎస్పీ.. ప్రకాష్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారని నిర్లక్ష్యంగా సమాధానమిచ్చిన పోలీసులు. వైసీపీ కార్యకర్తలను రెచ్చగొట్టేలా మాట్లాడి ఒకేసారి వందలమంది హెలీప్యాడ్ వద్దకు వెళ్లేందుకు ప్రకాష్ రెడ్డి కారణమయ్యారని ఆయనపై పోలీసులు కేసు నమోదు చేశారు. నమోదు చేశారు. ప్రకాష్ రెడ్డి వల్లే కుంటిమద్ది వద్ద ఏర్పాటు చేసిన హెలీప్యాడ్ వద్దకు వందల మంది కార్యకర్తలు దూసుకొచ్చారు.

పాపిరెడ్డిగ్రామంలో కార్యకర్తలను పంపించాలని, హెలీప్యాడ్ వద్ద కొందరు మాత్రమే ఉండాలని పోలీసులు చెప్పారు.. ప్రకాష్ రెడ్డి లెక్కచేయలేదు. అంతే కాకుండా పోలీసులపైకి కార్యకర్తలను ఉసిగొల్పారని, అందవల్లే పోలీసులను తోసుకొని మరీ కార్యకర్తలు హెలీప్యాడ్ వద్దకు వెళ్లారని పోలీసులు చెబుతున్నారు. హెలిప్యాడ్ వద్ద ఘటనకు ప్రధాన కారణం ప్రకాష్ రెడ్డే అంటూ రామగిరి పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

 

LEAVE A RESPONSE