( గ్రంధి సత్తి బాబు)
మెయిన్ న్యూస్ “అమరావతి టు హైదరాబాద్.. గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ ప్రెస్ హైవేకు కేంద్రం పచ్చజెండా” ఎంతో మంచి విషయం అనుకోండి. తెలుగు రాష్ట్రాల రాజధాని నగరాలతో పాటు… బయటి రాష్ట్రాలతో కూడా అమరావతి అనుసంధానం అవుతుంది ఈ ప్రాజెక్టు ద్వారా!
గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ ప్రెస్ హైవే నిర్మాణానికి ఆమోదం తెలపడంతో పాటు… దీనికి సంబంధించిన డీపీఆర్ రూపకల్పనకు వెంటనే చర్యలు ప్రారంభించాలని ఆయా శాఖలకు కేంద్రం ఆదేశాలు కూడా జారీ చేయడం చాలా మంచి పరిణామం.
పైన మొదటి పాయింట్ లో ‘మంచి విషయం అనుకోండి’ అని ఎందుకు అన్నాను అంటే…
ఈ ప్రాజెక్టుతో పాటు రాష్ట్రానికి సంబంధించి ఇంకా ఎన్నో కీలక అనుమతులు & ఆదేశాలు, సూచనలు కూడా కేంద్రం జారీ చేసింది.
వాటిలో ముఖ్యమైనవి :
విభజన హమీలో ఇప్పటికే మనకు కేటాయించిన బీపీసీఎల్ రిఫైనరీతో పాటు… మరో రిఫైనరీ ఏర్పాటుకు పరిశీలించాల్సిందిగా పెట్రోలియం శాఖకు ఆదేశాలు జారీ చేయడం.
విశాఖ, విజయవాడ, హైదరాబాద్, కర్నూలు కారిడార్ల ఏర్పాటును పరిశీలించాల్సిందిగా రైల్వే శాఖకు సూచించడం.
విశాఖ రైల్వే జోన్ పనులు వేగవంతం చేయాలని సూచించడంతో పాటు… వెనుకబడిన రాష్ట్రాలకు కేటాయించాల్సిన నిధుల విడుదలకు సంబంధించిన చర్యలు చేపట్టాల్సిందిగా ఆర్ధిక శాఖను ఆదేశించింది.
అలాగే దుగరాజపట్నం పోర్టు, శ్రీకాకుళం నుంచి చెన్నై ఆరు లేన్ల రహదారి పనులు పై దృష్టి సారించాల్సిందిగా ఆయా శాఖలను కేంద్ర హోంశాఖ ఆదేశించడం జరిగింది.
164 సీట్లతో ప్రజలు కట్టబెట్టిన విజయానికి… అనుక్షణం రుణం తీర్చుకునే ప్రయత్నంలో & కార్య సాధనలో ఉన్నారు. ఒక్క మూడేళ్ళలో రాష్ట్రమంతటా ఎన్నో అద్భుత దృశ్యాలు ఆవిష్కృతమవుతాయి. దార్శనికుడు పరిపాలనలో ఇది సత్యం.