Suryaa.co.in

Andhra Pradesh Political News

ఒక తాత.. ఒక మనవడు.. ఒక మంగళగిరి

( బాబు)

వాళ్ల తాత తరువాత తనే పట్టించుకొన్నాడు. మా మంగళగిరి ప్రజల కష్టం ఎవరికీ తెలియదు. ఒక మంచి ఆసుపత్రి కోసం తరాలుగా ఎదురుచూస్తున్నాం. చిన్న జబ్బు వచ్చినా పక్క ఊరికి వెళ్లాల్సిన దుస్థితి. ఎంతో మంది నాయకులు మారినా, మా గోడు వినే నాథుడు కరువయ్యాడు.

కానీ… ఈసారి మా లోకేష్ బాబు గెలిచాక మాకు ఆశ కనిపించింది. మా కష్టాలు మా మనసుతో చూశారు. 91 వేల ఓట్లతో గెలిపించి శాసనసభకు పంపిస్తే, మమ్మల్ని గుండెల్లో పెట్టుకున్నారు. మా 30 ఏళ్ల కలను నిజం చేసేందుకు ఆయన పడుతున్న తపన చూస్తుంటే కళ్లల్లో నీళ్లు తిరుగుతున్నాయి.

మా ఊరి ఆసుపత్రి… దేశానికే ఆదర్శం అంట!

చినకాకాని దగ్గర మా ఆసుపత్రి కోసం స్థలం చూశారు. ఏకంగా లక్షా పదిహేను వేల చదరపు అడుగుల్లో భలే పెద్ద భవనం కడుతున్నారట! కార్పొరేట్ ఆసుపత్రుల్లో ఉండే అన్ని సౌకర్యాలు మా ఊరి ఆసుపత్రిలో కూడా ఉంటాయంటే నమ్మబుద్ధి కావడం లేదు. డాక్టర్లు, నర్సులు హాయిగా పనిచేసేలా, రోగులు త్వరగా కోలుకునేలా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారట. ఏడాదిలోపే మా ఆసుపత్రి రెడీ అయిపోతుందంటే… ఇది కలా నిజమా అనిపిస్తోంది!

అన్ని జబ్బులకూ ఒకే చోట వైద్యం – ఇకపై దూరమెళ్లాల్సిన పనిలేదు!

గుండె డాక్టర్ దగ్గరికా, పిల్లల డాక్టర్ దగ్గరికా, కాన్పుల కోసం వేరే ఊరికా… ఇకపై ఆ తిప్పలు ఉండవు. అన్ని రకాల వైద్యం ఒకే చోట దొరుకుతుంది. ఆపరేషన్ థియేటర్లు, డయాలసిస్ సెంటర్… అంతేకాదు, మా పిల్లల కోసం తలసేమియా వార్డు, మానసిక ఇబ్బందులున్న వాళ్ల కోసం ప్రత్యేక సెంటర్ కూడా పెడుతున్నారట. మా లోకేష్ బాబుకు ఎంత మంచి మనసో కదా!

పాదయాత్రలో ఇచ్చిన మాట… గుండెల్లో పెట్టుకున్నాడు!

యువగళం పాదయాత్రలో మా ఊరికి మంచి ఆసుపత్రి కట్టిస్తానని లోకేష్ బాబు మాటిచ్చారు. అధికారంలోకి రాగానే ఆ మాట నిలబెట్టుకున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని ఒప్పించి నిధులు తెచ్చారట. మా కోసం ఆయన ఎంతగానో పోరాడుతున్నారని మాకు తెలుసు.

మా ఊరి ఆసుపత్రి… మా గుండె చప్పుడు!

ఎన్టీఆర్ గారు మొదలుపెట్టిన ఆసుపత్రిని పట్టించుకునే నాథుడు లేక ఎన్నో ఏళ్లు మూతపడే దుస్థితికి చేరుకుంది. ఎంతో మంది నాయకులకు మొరపెట్టుకున్నా ఫలితం లేదు. కానీ లోకేష్ బాబు రాకతో మా ఆశలు చిగురించాయి. మా ఊరి ఆసుపత్రి మళ్లీ కళకళలాడుతుంది. మా పిల్లలకు మంచి వైద్యం అందుతుంది.

ఇప్పటికే నిరుపేదలకు ఇంటి పట్టాలు పంపిణీ, భూగర్భ డ్రైనేజీ వంటి అనేక అభివృద్ధి పనులు వేగంగా జరుగుతున్నాయి. పార్కులు గట్రా పూర్తయ్యాయి. మా నరసింహ స్వామి గుడి నుండి వీధి వీధీ అభివృద్ధి చేస్తున్నారు. రాష్ట్రం అంతా మా మంగళగిరి మీద దిష్టిపెట్టేలా అభివృద్ధి చేస్తున్నారు. గతంలో ఓడించినందుకు పశ్చాత్తాపపడేలా చేస్తున్నాడు.

లోకేష్ బాబు కేవలం ఒక నాయకుడు కాదు… మా ఊరి ఆశాకిరణం. మా కష్టాల్లో పాలుపంచుకునే ఒక మంచి మనిషి. ఆయన చేయి తిరిగితే మంగళగిరి స్వర్గధామం అవుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు! మా గుండెల్లో ఆయన స్థానం ఎప్పటికీ పదిలంగా ఉంటుంది!

ఇట్లు

మంగళగిరి ఓటరు

LEAVE A RESPONSE