– మంత్రి మనోహర్
తెనాలి: తెనాలి పురపాలక సంఘం ఆధ్వర్యంలో నూతనంగా కొనుగోలు చేసిన రెండు ట్రాక్టర్లు, ఒక జేసీబీ, మూడు కంపాక్టర్లను మంత్రి నాదెండ్ల మనోహర్ సోమవారం ప్రారంభించారు. శివాజీ చౌక్ వద్ద జరిగిన కార్యక్రమంలో అధికారులతో కలిసి పాల్గొన్న మంత్రి నాదెండ్ల వాటిని ప్రారంభించి జేసీబీ ఎక్కి స్టార్ట్ చేశారు. పట్టణ పరిశుభ్రత కోసం 15వ ఆర్థిక సంఘం నిధులతో కొనుగోలు చేసిన నూతన వాహనాలను సక్రమంగా వినియోగించాలని అధికారులకు మంత్రి మనోహర్ సూచించారు.
ఈ సందర్భంగా మనోహర్ మాట్లాడుతూ అభివృద్ధి చెందిన పట్టణాలకు దీటుగా తెనాలిని ముందుకు తీసుకువెళ్తామని, తెనాలి ప్రాంతంలో రోడ్లు వెడల్పు పనులు చురుగ్గా సాగన్నునాయని, ఇప్పుడు చేస్తున్న పనులు మొత్తం పూర్తయితే తెనాలి రూపురేఖలు మారుతాయని. పట్టణ అభివృద్ధికి ప్రజలందరూ మున్సిపాలిటీకి సహకారం అందించాలని కోరారు.