Suryaa.co.in

Andhra Pradesh

కమ్మవారు విద్య, వైద్యం, ఉపాధిపై విస్తృతంగా దృష్టి సారించాలి

– ప్రకాశం జిల్లా కమ్మవారి సేవా సంఘం ఆత్మీయ సమ్మేళనంలో తీర్మానాలు

ఒంగోలు: వీకేబీ కన్వెన్షన్ లో కమ్మ వారి సేవా సంఘం ఆధ్వర్యంలో ఆత్మీయ సమావేశం ఘనంగా జరిగింది. అధ్యక్షుడు మండవ మురళీకృష్ణ అధ్యక్షతన ఆదివారం ఆంధ్రప్రదేశ్ కమ్మ సంఘాలు, కమ్మ ప్రముఖుల ఆత్మీయ సమావేశం నిర్వహించారు.

విజయవాడ, గుంటూరు, శ్రీకాకుళం, విశాఖపట్నం, విజయనగరం, రాజమండ్రి, కాకినాడ, తణుకు, ఏలూరు, ద్వారకా తిరుమల, ఒంగోలు, తిరుపతి, కర్నూలు, అనంతపురం, గుంతకల్లు, గుత్తి, నంద్యాల, కడప గుడివాడ, బాపట్ల, వినుకొండ, కోటప్పకొండ, మైలవరం, నందిగామ, జగ్గయ్యపేట, తెనాలి, మండపేట, రామచంద్రాపురం, రాజానగరం, కాణిపాకం, కపిలేశ్వరపురం మొదలైన ప్రాంతాల నుంచి కమ్మ సంఘాల ప్రతినిధులు హాజరయ్యారు. తెలంగాణాలో హైదరాబాద్, ఖమ్మం, భద్రాచలం, కొత్తగూడెం నుంచి కమ్మ ప్రతినిధులు, కమ్మ సమాజంలో పెద్దలు పాల్గొన్నారు.

కాకతీయ ఎడ్యుకేషన్ ట్రస్ట్ కార్యదర్శి గూడూరు సత్యనారాయణ, సభ్యుడు మాజీ హైకోర్టు జడ్జి జస్టిస్ చల్లా కోదండరాం, ఎన్‌ఆర్ఐ టీడీపీ అధ్యక్షుడు, తానా మాజీ అధ్యక్షుడు కోమటి జయరాం, ప్రముఖ విద్యావేత్త, వైద్యుడు గన్ని భాస్కరరావు, టీటీడీ సభ్యుడు అక్కిన ముని కోటేశ్వరరావు, గుంటూరు కమ్మ సంఘం అధ్యక్షుడు గోరంట్ల పున్నయ్య చౌదరి, కార్యదర్శి కోటేశ్వరరావు, గుంటూరు కాకతీయ కన్వెన్షన్ అధ్యక్షుడు కొత్తపల్లి రమేష్ చంద్ర, వ్యవస్థాపక అధ్యక్షుడు, వినుకొండ కమ్మ హాస్టల్ వ్యవస్థాపకుడు గడిపూడి వెంకట్రాయుడు, నిర్వాహకులు రాధాకృష్ణ, కాంటినెంటల్‌ కాఫీ ఛైర్మన్‌ చల్లా రాజేంద్రప్రసాద్‌, గ్రేటర్ విజయవాడ అధ్యక్షుడు నన్నపనేని నాగేశ్వరరావు, వ్యవపస్థాపక కార్యదర్శి కనకమేడల శ్రీనివాస చక్రవర్తి, ఉపాధ్యక్షుడు గుమ్మడి రామకృష్ణ, లింగమనేని శివరామప్రసాద్, గుంటూరు బాలికల హాస్టల్‌ నిర్వాహకులు సామినేని కోటేశ్వరరావు, తిరుపతి కమ్మ సంఘం అధ్యక్షుడు పులిపాటి పురందర నాయుడు, గోకవరం కమ్మ హాస్టల్ నిర్వాహకులు నల్లూరు చలపతి, కపిలేశ్వరపురం కమ్యూనిటీ కిచెన్ నిర్వాహకుడు నెక్కంటి , బాపట్ల కమ్మ సంఘం అధ్యక్షుడు ఆచంట రమేష్, మహిళా అధ్యక్షురాలు మానం విజేత, గుత్తి కమ్మ సంఘం అధ్యక్షుడు గోపినీడి సురేంద్ర, అనంతపురం కమ్మ సంఘం సభ్యులు ఉమ్మన్ని శ్రీనివాసులు, కర్నూలు కమ్మ సంఘానికి చెందిన ప్రతాపనేని మాధవ నాయుడు, శ్రీకాకుళం కమ్మ సంఘం కార్యదర్శి కృష్ణ ప్రసాద్, విశాఖపట్నం కాకతీయ ట్రస్ట్ కార్యదర్శి నెక్కంటి వెంకటేశం, మందలపు జగదీశ్‌ వంటి ఇతర ముఖ్యులు పాల్గొని ప్రసంగించారు.

ఈ సమావేశంలో ప్రకాశం జిల్లా కమ్మ సంఘం ప్రతినిధులు, ప్రముఖులు కూడా ప్రసంగించారు. మండవ రమ వ్యాఖ్యాతగా వ్యవహరించారు. ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అడుసుమిల్లి శ్రీనివాసరావు, అంకమ్మ చౌదరి, అప్పసాని రాజేష్ పాల్గొని కమ్మ కుల సంఘాలు రాబోయే రోజుల్లో రాజకీయాల్లో పోషించాల్సిన పాత్ర గురించి ప్రసంగించారు. ప్రకాశం జిల్లా కమ్మ సంఘం ప్రధాన కార్యదర్శి అలా హనుమంతరావు వందన సమర్పణ చేశారు. ఈ సమావేశంలో పాల్గొని ప్రసంగించిన కమ్మ ప్రముఖుల సూచనలు, సలహాలు ఆనుసరించి పలు తీర్మానాలు చేశారు.

– విద్య, వైద్యం, ఉపాధి కార్యక్రమాలపై విస్తృత దృష్టి సారించాలని నిర్ణయించారు. కమ్మవారిలో ఆర్థికగా వెనుకబడిన, గ్రామీణ ప్రాంతాల్లో విద్యార్థినీవిద్యార్థులకు నాణ్యమైన విద్య, వసతి ఉచితంగా అందచేయాలని, రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో జరిగే పోటీ పరీక్షలకు ఉచిత వసతి కల్పించి కోచింగ్ ఇప్పించాలని తీర్మానించారు.
– ఆర్థికంగా వెనుకబడి వైద్యం చేయించుకోలేని నిరుపేదలకు వైద్య సహాయం అందించటం, హెల్త్ ఇన్సూరెన్స్ కల్పించటం, మెరుగైన వైద్య సదుపాయాలు, వైద్య పరీక్షలు అందించాలని నిర్ణయించారు.
– నిరుద్యోగ యువతీయువకుల్లో వృత్తి నైపుణ్యం పెంచేందుకు నిపుణులతో శిక్షణ ఇప్పించాలని తీర్మానించారు. వారికి ఉద్యోగం కల్పించడంలో సహాయం చేయటం, అర్హులైన వారికి స్వయం ఉపాధి కల్పించటంపై నిర్ణయం తీసుకున్నారు.
– కమ్మవారి చరిత్ర, కమ్మ ప్రముఖుల చారిత్రక గ్రంథాలు సేకరించి భావితరాలకు తెలియచేసేలా లైబ్రరీ, డిజిటల్ లైబ్రరీ ఏర్పాటు చేయనున్నారు.
– కమ్మవారి అభ్యున్నతిని ప్రతిబింబించేలా రాష్ట్ర రాజధాని ప్రాంతంలో “కమ్మభవన్” నిర్మించాలని నిర్ణయించారు. అక్కడి నుంచే అన్ని కార్యక్రమాలు పర్యవేక్షించటం, కోచింగ్‌కు వసతి కల్పించటం, లైబ్రరీ, డిజిటల్ లైబ్రరీ ఏర్పాటు చేయటం, సమావేశ మందిరం నిర్మించటం మొదలైనవి ఏర్పాటు చేయాలని తీర్మానించారు.
– రాష్ట్రస్థాయి, జాతీయ స్థాయిలో రాణిస్తున్న క్రీడాకారులకు అత్యుత్తమ శిక్షణ అందించే వీలుగా వారికి స్పాన్సర్స్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.
– కాకతీయ ఎడ్యుకేషన్ ట్రస్ట్ ద్వారా ప్రస్తుతం నిర్వహిస్తున్న బాల, బాలికల వసతి గృహాల సంఖ్య 12 నుంచి 100కు పెంచాలని నిర్ణయించారు.
– గ్రామీణ ప్రాంతాల్లో తమ సంతానానికి దూరంగా, ఒంటరిగా నివాసం ఉంటున్న వృద్ధులకు సామూహిక భోజన వసతి కల్పించే “కమ్యూనిటీ కిచెన్” లు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.
– దేశ, విదేశాల్లో ఉంటున్న కమ్మ ప్రముఖులను ఒక తాటిపైకి తెచ్చి కమ్మ సమాజానికి గౌరవం, బలం చేకూర్చేలా “కమ్మ మహా సభ” నిర్వహించాలని నిర్ణయించారు.

LEAVE A RESPONSE