– తన ఇంటికి రోడ్డు నిర్మించుకునేందుకు చంద్రబాబు ముఖ్యమంత్రి కాలేదు
– పంచాయతీ నిధులను కూడా వారి వద్ద ఉంచుకున్నారు
– ఉండవల్లిలో ఏర్పాటు చేసిన టీడీపీ ఎమ్మెల్యేల సమావేశంలో ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు
వైసీపీ నాయకులు నేడు పరిపాలనా వికేంద్రీకరణ పేరుతో ఒక కొత్త నాటకానికి తెరలేపారు. అమరావతి రాజధాని సరిగా నిర్మించలేదు. మేము అధికారంలోకి వచ్చాక బ్రహ్మాండంగా కడతామని ఎన్నికలకు ముందు జగన్ రెడ్డి అన్నారు. కల్లబొల్లి మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన జగన్, ఎమ్మెల్యేలు మాట తప్పి, మడమ తిప్పారు. మరోసారి మోసం చేయాలని చూస్తున్నారు. అమరావతి రాజధానిపై లేనిపోని కల్లబొల్లి మాటలు చెబుతున్నారు. జగన్ రెడ్డి అసెంబ్లీలో మాట్లాడినవన్నీ అసత్యాలే. అమరావతిని చిదిమేశారు. మూడున్నర సంవత్సరాలుగా రాష్ట్రానికి రాజధాని లేకుండా చేశారు.
రాష్ట్ర ప్రజలను భవిష్యత్తులో కన్ ఫ్యూజన్ ని క్రియేట్ చేశారు. ఒక దగ్గర ఉండాల్సిన పరిపాలనని మూడు ముక్కలు చేస్తామంటున్నారు. అధికారాలను మూడు చోట్లకు విసిరేసీ ఇదే వికేంద్రీకరణ అంటున్నారు. పరిపాలనా వికేంద్రీకరణ అంటే గ్రామ పంచాయతీల నుండి సెక్రటేరియేట్ వరకు అధికారాల బదలాయింపు జరిగి పరిపాలనా ప్రక్రియ సులభతరమవ్వాలి. ప్రభుత్వ సేవలు ప్రజలకి దగ్గర కావాలి. నేడు పంచాయతీ నిధులను కూడా వారి వద్ద ఉంచుకున్నారు. అధికారాలను తమ చెప్పు చేతుల్లో పెట్టుకున్నారు.
పన్నులు ఎంత వేయాల్సింది వాళ్లే నిర్ణయిస్తున్నారు. లోకల్ బాడీ అధికారాలన్నీ వీరి చెప్పు చేతుల్లో పెట్టుకున్నారు. ఇది తెలుగు జాతి క్షమించని నేరం. జగన్మోహన్ రెడ్డి అనేక తప్పులు చేస్తున్నారు. ప్రాంతాల మధ్య విద్వేషాలను రెచ్చగొడుతున్నారు. ప్రాంతాలవారీగా విడదీస్తున్నారు. ఇంతకాలం కుట్రలు కుతంత్రాలతో పరిపాలన కొనసాగించారు. భవిష్యత్తులో కూడా ఇదే ప్రణాళికతో ముందుకెళ్లాలని భావిస్తున్నారు. అమరావతికి భూములు ఇచ్చిన రైతులు వారి హక్కుల కోసం అమరావతి నుండి అరసవెల్లికి పాదయాత్ర చేస్తుంటే ఉత్తరాంధ్ర ప్రాంత ప్రజల్ని రెచ్చగొడుతున్నారు. అసెంబ్లీలో ముఖ్యమంత్రి చేసిన ప్రసంగం దారుణం. రైతుల యాత్రను అడ్డుకోవాలని చూస్తున్నారు. 13 జిల్లాల వాసులు ఏకగ్రీవంగా అనుమతించిన అమరావతి రాజధానిని చదివేయాలని చూస్తున్నారు. హైకోర్టు మొట్టికాయలు వేసినా ఉపయోగం లేదు. సుప్రీంకోర్టు చివాట్లు పెట్టింది.
ఒకసారి అసెంబ్లీలో అన్ని పార్టీలు అమరావతే రాజధాని అని తీర్మానించాయి. విజయ సాయి రెడ్డి పార్లమెంటులో ప్రైవేటు బిల్లు పెట్టాడు. రాజధాని ఏర్పాటు చేసుకోవడానికి అసెంబ్లీకి అధికారాలు ఇవ్వమని ప్రైవేటు బిల్లు పెట్టారు. కేసుల నుండి తప్పించుకోవడానికి వారు ఆడని ఆట లేదు. మూడు సంవత్సరాల్లో అనేక ప్రయత్నాలు చేసి విఫలమయ్యారు. రాజకీయంగా పబ్బం గడుపుకోవాలని తపన జగన్ రెడ్డిది. ఈ మూడున్నర సంవత్సరాల కాలంలో రాష్ట్రంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదు. ధరలు విపరీతంగా పెరిగాయి. ప్రభుత్వ అసమర్థ విధానాలతో ప్రజలు విసిగి వేశారారు. ఉత్తరాంధ్ర పైన అభిమానం ఉంటే విశాఖను ఈ మూడున్నర సంవత్సరాల్లో ఎందుకు అభివృద్ధి చేయలేకపోయారు?
టిడిపి హయాంలో విశాఖకు వచ్చిన పరిశ్రమలను ఎందుకు వెళ్ళగొట్టారు. వైసీపీ ప్రభుత్వం అమరావతిని చంపేసిందే కాకుండా దుష్ప్రచారం చేస్తున్నారు. ప్రభుత్వ సొమ్ముతో సంబంధం లేకుండా సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్టుగా అమరావతి అభివృద్ధికి ప్రణాళిక రూపొందించారు. భవిష్యత్తులో భావితరాలు గర్వపడేవిధంగా రాజధాని రూపకల్పన జరిగింది. గత ప్రభుత్వం నిర్మించిన భవనాల్లోనే ప్రస్తుతం పరిపాలన సాగిస్తున్నారన్న విషయాన్ని గుర్తుచేస్తున్నాం. దేశంలోనే ప్రఖ్యాతమైన ఎడ్యుకేషనల్ ఇన్స్టూసెన్స్ అమరావతికి వచ్చాయి. అమరావతి అభివృద్ధి కళ్ల ముందు కనిపిస్తున్నా.. వైసీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు దుష్ప్రచారం చేస్తున్నారు.
విధ్వంసకరమైన పరిస్థితులు సృష్టించి అమరావతి అభివృద్ధికి పాతరేశారు. రూ.మూడు వేల కోట్లు అప్పు తెచ్చుకోవడానికి అమరావతి భూముల్ని రూ.17 కోట్లకు తనఖా పెట్టిన మాట వాస్తవం కాదా? నిజాలు బయటపెట్టింది. తనఖా రిజిస్ట్రేషన్లను ఎందుకు భయటపెట్టడం లేదు. ఇప్పటికైనా విషపూరిత మనస్తత్వం వదిలిపెట్టి మంచి దృక్పతంతో అమరావతిపై ముందుకెళ్లాలి. గతంలో బల్లులు కూడా గుడ్లు పెట్టని ప్రాంతంలో హైటెక్ సిటీ నిర్మిస్తే , ఆ ప్రాంతంలో ప్రస్తుతం ఎకరా రూ.75 కోట్లకు అమ్ముడుపోతున్నాయి. అమరావతిపై దుష్ప్రచారాలు మానుకోవాలని టీడీపీ డిమాండ్ చేస్తోంది – తన ఇంటికి రోడ్డు నిర్మించుకునేందుకు చంద్రబాబు ముఖ్యమంత్రి కాలేదు. ఒక ప్రణాళిక బద్ధంగా అమరావతి నిర్మాణం జరగాలని సంకల్పించాం.
రాష్ట్రంలోని గ్రామాల్లో 25000 కీలోమీటర్లు సీసీ రోడ్లు నిర్మించిన ఘనత టీడీపీ ప్రభుత్వానికే దక్కుతుంది. దేవుళ్లను సైతం రాజకీయానికి సీఎం వాడుకోవడం దుర్మార్గం. కనక దుర్గ వంతెనను ఎన్నో సమస్యను ఎదుర్కొని టీడీపీ ప్రభుత్వం పూర్తి చేస్తే.. మీరు వచ్చి ప్రారంభించి మేమే నిర్మించామని చెప్పడం మీ అజ్ఞానానికి నిదర్శనం. 75 శాతం పోలవరం ప్రాజెక్టు పనులను టీడీపీ ప్రభుత్వం పూర్తి చేస్తే.. మీ చేతగానితనంతో పోలవరం భవిష్యత్తును అంధకారంలోకి నెట్టారు. పోలవరం ఎప్పటికీ పూర్తవుతుందో కుండా వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలే చెప్పలేని పరిస్థితి. అనాలోచిత నిర్ణయాలు, స్వార్థం, సంకుచిత భావాలతో పరిపాలన సాగిస్తే జరిగే విధ్వంసం పోలవరం విషయంలో ప్రజలకు అర్థమైందని టీడీపీ ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు వివరించారు.