Suryaa.co.in

Political News

అన్నింటికీ సమాధానం వస్తుంది..

అమరావతి పై గొప్పగా ప్రచారం చేసినా
రాజధాని ప్రాంతంలో ఒక్క సీటు గెలవలేదు
పరుగులు పెట్టించిన పోలవరంలో సీటు గెలవలేదు
కియా తెచ్చిన అనంతపురం జిల్లాలో పట్టు పోయింది
పరిశ్రమలు పెట్టుబడులు తెచ్చినా యువత జగన్ వైపు
మంచి ఫిట్మెంట్ జీతాలు ఇచ్చినా ఉద్యోగులు జగన్ వైపు
గత వైఖరికి భిన్నంగా బాబు జలప్రాజెక్టులు పూర్తి చేసినా కొంత ఋణమాఫీ చేసినా రైతులు జగన్ వైపు

ఇలా కొన్ని గొప్పగా చెప్పుకున్నా
జనం జగన్ వైపు నిలబడ్డారు.
ప్రత్యర్ధులు చెప్పే కారణాలు మాత్రం
-కమ్మరావతి అని జనం భావించారని
-పోలవరం ఏటిఎం అనే ఆరోపణలు నమ్మారు అని
-పరిశ్రమలు పెట్టుబడులు అనేది హైప్ మాత్రమే అని
-రైతులను నమ్మించి మోసం చేశారని

నా అభిప్రాయం ప్రకారం పైవన్నీ చేయలేదు అని కాదు

అమరావతి ప్రాంతంలో ఇల్లు కట్టుకుని
బాబు కన్నా వేగంగా పూర్తి చేస్తారు అని నమ్మించారు
కాబట్టి అమరావతి ప్రాంతవాసులు జగన్ వైపు నిలబడ్డారు

పోలవరం ముంపు బాధితులకు పరిహారం
పది లక్షలకు పెంచి ఇస్తానని నమ్మించారు
కాబట్టి పోలవరం పోయింది

జగన్ స్వతహాగా పారిశ్రామికవేత్త కాబట్టి
బాబు కన్నా మిన్నగా పరిశ్రమలు తెస్తారు అని
సోనియాను ఎదిరించిన అరివీర భయంకర ధైర్యవంతుడు
మోడీ మెడలు కూడా వంచి ప్రత్యేక హోదా తెస్తారు అని
ఏటా ఉద్యోగ కేలండర్ ఇస్తారు అని
యువకులు నిరుద్యోగులు జగన్ కి జై కొట్టారు

సిపిఎస్ రద్దు చేస్తారని ఉద్యోగులు
రెండు చేతులతో ఓట్లు వేశారు

అపర భగీరథుడు అని ప్రచారం చేసిన వైఎస్ బిడ్డ కాబట్టి వారి కన్నా మిన్నగా న్యాయం చేస్తారు అని రైతులు మద్దతు ఇచ్చారు

బాబు 200 నుంచి 2000 పెంచి ఇచ్చినా జగన్ 3000 ఇస్తాను అన్నారు కాబట్టి జగన్ వైపు వృద్ధులు కొంత మొగ్గారు

ఇలా వివిధ వర్గాలు కృతజ్ఞత కన్నా అత్యాశతో కొంత ఎక్కువ జనం జగన్ వైపు నిలబడ్డారు అని బాబు కన్నా మిన్నగా పరిపాలన చేస్తారు అని నా అభిప్రాయం చెబుతూ ఉన్నా!

ఇపుడు జగన్ ఓడితే…
అభివృద్ధి సంక్షేమం రెండూ కావాలి
అని జనం భావించారు అనుకోవాలా?
జగన్ కన్నా బాబు ఎక్కువ ఇస్తారు
అని జనం భావించారు అనుకోవాలా?
సంక్షేమం వద్దు
అని జనం భావించారు అనుకోవాలా?

ఇపుడు అద్భుతం జరిగి జగన్ గెలిస్తే..
కేవలం సంక్షేమం చాలు అభివృద్ధి అవసరం లేదు
అని జనం భావించారు అనుకోవాలా?
జగన్ అభివృద్ధికి కొత్త అర్థం చెప్పారు
అది జనం ఆమోదించారు అనుకోవాలా?

పొరబాటున ఈ రెండోది జరిగితే..
ఉపాధి అవకాశాలు పరిశ్రమలు పెట్టుబడులు
జలప్రాజెక్టులు జనానికి సౌకర్యాలు మౌళిక సదుపాయాలు
ఇవేవీ ఉండవు దేశంలో గుజరాత్ మినహా
ప్రతి రాష్ట్రంలో సిఎం ఒక బటన్ సిఎం అవుతారు
నెలకోసారి వచ్చి బటన్ నొక్కి వెళ్ళిపోతారు
ఇది దేశానికే ప్రమాదకరం.

– పిపిఎన్ ప్రసాద్

LEAVE A RESPONSE