-33 జిల్లాలకు ప్రత్యేక బృందాలు
-బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
హైదరాబాద్: రాబోయే మూడు, నాలుగు నెలల పాటు విస్తృత స్థాయి కార్యక్రమాలు చేపట్టాలని బీఆర్ఎస్ పార్టీ నిర్ణయించింది. ఈ మేరకు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ 33 జిల్లాలకు ప్రత్యేక బృందాలను ప్రకటించారు. క్షేత్రస్థాయిలో పార్టీ కార్యక్రమాలను ఈ ప్రత్యేక బృందాలు సమన్వయం చేయనున్నాయి. స్థానిక మంత్రులు, ఎమ్మెల్యేలతో ప్రత్యేక బృందాలు సమావేశం కానున్నాయి. సమావేశాలు, ప్రణాళికల అమలుపై వారితో చర్చించాలని ప్రత్యేక బృందాలను కేటీఆర్ ఆదేశించారు. ఇందులో భాగంగా విస్తృతంగా ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహించాలని ఆదేశించారు.
33 జిల్లాల ప్రత్యేక బృందాల వివరాలు..
హైదరాబాద్ – సీనియర్ నాయకుడు డా. దాసోజు శ్రావణ్
మేడ్చల్ మల్కాజ్‌గిరి – ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి
వికారాబాద్ – ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి
రంగారెడ్డి – ఎమ్మెల్సీ ఎల్. రమణ
వనపర్తి, జోగులాంబ గద్వాల – ఎమ్మెల్సీ తక్కళ్ళపల్లి రవీందర్ రావు
నాగర్ కర్నూల్ – ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి
మహబూబ్ నగర్, నారాయణపేట – ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణ రెడ్డి
సిద్దిపేట – పార్టీ జనరల్ సెక్రటరీ బోడకుంట్ల వెంకటేశ్వర్లు
సంగారెడ్డి – ఎమ్మెల్సీ వెంకట్ రామ్ రెడ్డి
మెదక్ – ఎమ్మెల్సీ ఎగ్గే మల్లేశం
నల్లగొండ – ఎమ్మెల్సీ కడియం శ్రీహరి
యాదాద్రి భువనగిరి – ఎమ్మెల్సీ డా. యాదవ రెడ్డి
సూర్యాపేట – కార్పొరేషన్ ఛైర్మన్ మెట్టు శ్రీనివాస్
రాజన్న సిరిసిల్ల – ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య
జగిత్యాల – పార్టీ సెక్రటరీ కోలేటి దామోదర్
పెద్దపల్లి – కార్పొరేషన్ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్|
భూపాలపల్లి, ములుగు – మాజీ ఎమ్మెల్సీ అరికెల నర్సారెడ్డి
హనుమకొండ, వరంగల్ – ప్రభుత్వ విప్ ఎమ్. ఎస్ ప్రభాకర్
జనగామ – ఎమ్మెల్సీ కోటిరెడ్డి
మహబూబాబాద్ – మాజీ ఎమ్మెల్సీ పురాణం సతీష్
నిర్మల్, ఆదిలాబాద్,మంచిర్యాల – ఎమ్మెల్సీ వి. గంగాధర్ గౌడ్
కొమురంభీం ఆసిఫాబాద్ – మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్
కామారెడ్డి – ఎమ్మెల్సీ దండే విఠల్
నిజామాబాద్ – ఎమ్మెల్సీ బండ ప్రకాష్
ఖమ్మం – ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డి
భద్రాద్రి కొత్తగూడెం – ఎమ్మెల్సీ భానుప్రసాద్