నేత్రదానం ఒక ఉద్యమంలా సాగాలి

0
11

– మానవ జీవితంలో అన్నిటికన్నా నేత్రదానం ప్రధానం నర్రెడ్డి తులసిరెడ్డి
– స్వచ్చంద సంస్థ నేత్రనిధి కి నేత్రదాన వీలునామా పత్రాలు రాసి ఇచ్చిన తులసి రెడ్డి దంపతులు

మానవ ఘట్టం లో నేత్రదానం అతి ప్రధానమైనది అని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ డాక్టర్ నర్రెడ్డి తులసి రెడ్డి గురువారం వేంపల్లి లోని వారి స్వగృహం నందు తమ మరణానంతరం నేత్రదానం చేసేందుకు అంగీకరిస్తూ వీలునామా పత్రాలలో తులసి రెడ్డి ఆయన సతీమణి అలిమేలు దంపతులు సంతకాలు చేసి పులివెందుల స్నేహిత అమృత హస్తం సేవాసమితి నేత్రనిధి అధ్యక్షులు రాజు కు అందజేశారు.

తులసి రెడ్డి దంపతులతో పాటు ఆయన సహచరులు 20 కుటుంబాలు నేత్రదాన అంగీకార పత్రాలు అందజేశారు… ఈ సందర్బంగా తులసి రెడ్డి ఆయన సహచరులతో నేత్రదాన అంగీకార ప్రతిజ్ఞ చేయించారు.

ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ సర్వెంద్రియం నయనం ప్రధానం… అని ప్రస్తుత సమాజం లో అంధత్వంతో కొన్ని లక్షల మంది ఈ ప్రపంచాన్ని చూడలేక బాధపడుతూ ఉన్నారని, చీకట్లో ఉన్న వారిimage జీవితాల్లో వెలుగులు నింపడానికి వెల కట్టలేని, పైస ఖర్చు లేని, మనిషి మరణానంతరం శరీరం తో పాటు మట్టి లో కలిసి పోయే నేత్రాలను దానం చేస్తే చాలు వారికి వెలుగు ప్రసాదించే ఈ బృహత్ కార్యానికి ప్రతిఒక్కరు, ప్రతి కుటుంబం అవగాహన కలిగి ఉండవలసిన అవసరం ఎంతైనా ఉందని ఆయన పేర్కొన్నారు.

ఈ సందర్బంగా స్నేహిత అమృత హస్తం సేవాసమితి అధ్యక్షులు మొమ్మెల రాజు మాట్లాడుతూ మరణించిన సమయంలో కుటుంబ సభ్యులు మానవత్వం తోను సహృదయం తోనూ నేత్రదానానికి అంగీకారం తెలిపి స్నేహిత అమృత హస్తం సేవా సమితి నేత్రనిధి కి సమాచారం ఇచ్చినట్టు అయితే అంత్యక్రియలకు ఎలాంటి ఆటంకం కలిగించకుండా వెంటనే పార్దివ దేహం నుండి కార్నియా లను సేకరించడం జరుగుతుంది అన్నారు.

ఈ కార్యక్రమంలో స్నేహిత అమృత హస్తం సేవా సమితి నేత్రనిధి టెక్నీషియన్ హరీష్, ఆర్య వైశ్య సంఘం సభ్యులు అరవింద్, కాంగ్రెస్ నాయకులు బి. నరసింహా రెడ్డి, బి. రామకృష్ణ, కే. అమర్నాథ్ రెడ్డి, జి. ఉత్తన్న, రాఘవ, బద్రీనాథ్, రామయ్య, శేఖర్, శివయ్య తదితరులు పాల్గొన్నారు.