జగన్ కులంలో పది మంది దోచుకునేవాళ్లు, దాచుకునేవాళ్లు పంచుకునేవాళ్లకే పండగ

0
9

– మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి

గతంలో ఎన్నడూ లేని విధంగా మూడున్నరేళ్లలో రాజకీయాలు దిగజారిపోయాయి.దుర్మార్గమైన పరిపాలన రాష్ట్రంలో జరుగుతుంది.గతంలో డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సీటీ అని వైఎస్ఆర్ పేరు పెట్టారు.ఆయన కొడుకు అధికారంలోకి వచ్చి ఎన్టీఆర్ పేరు తొలగించాడు.

ప్రభుత్వాలు మారితే సంస్థల పేర్లు మారుస్తారా? నెహ్రూ, గాంధీ, ఇందిరా గాంధీ, అంబేద్కర్, జగజీవన్ రామ్ ల పరిస్థితి ఏంటి? వైసీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు, ముఖ్య మంత్రి కలిసి రాష్ట్రాన్ని దోచేస్తున్నారు. ఎంత మంది ముఖ్య మంత్రులు పని చేసినా పత్రికలు, మీడియా, కులాల గురించి నిండు శాసనసభలో మాట్లాడ లేదు…ఒక్క జగన్ తప్ప. జగన్ కులంలో పది మంది దోచుకునేవాళ్లు, దాచుకునేవాళ్లు పంచుకునేవాళ్లు మాత్రమే హ్యాపీగా ఉన్నారు. కాంట్రాక్టులు చేసిన రెడ్లు బిల్లుల కోసం విజయవాడలో అర్థనగ్న ప్రదర్శన చేశారు.

ఎన్టీఆర్ ముందు జగన్ ఒక బచ్చా. రైతుల కోసం 18 గంటలు విద్యుత్ ఇచ్చిన వ్యక్తి ఎన్టీఆర్. నియోజక వర్గాల్లో చిన్న వ్యాపారం చెయ్యాలంటే ఎమ్మెల్యే అనుగ్రహం కావాల్సి వచ్చింది. చీమకుర్తి లాంటి ప్రాంతాల్లో గ్రానైట్ వ్యాపారం చెయ్యాలంటే జగన్ కనుసన్నల్లో చెయ్యాలి…లేక పోతే కోర్టులకు వెళ్లి కాపాడు కోవాలి. నెల్లూరు సిలికా శ్యాండ్ నుండి ఇడుపులపాయ అకౌంట్ కి ప్రతి నెల 30, 40 కోట్లు వెళ్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం జగన్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీగా మారిపోయింది.