Suryaa.co.in

Telangana

దేశంలో రైతు సంక్షేమ కార్యక్రమాలు పెరిగాయి

౼ ప్రధానమంత్రి మోడీ రైతు సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నారు
– తక్కువ ధరలకే ఎరువులు, విత్తనాలు, వ్యవసాయ పనిమొట్లు, కిసాన్ సమ్మాన్ యోజన లాంటి అనేక కార్యక్రమాలు చేస్తున్నది
– కేంద్ర ప్రభుత్వం ఒక విప్లవాత్మక మార్పుకు శ్రీకారం చుట్టింది
కేంద్ర మంత్రి, తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి

రైతులకు కావాల్సిన అన్ని రకాల సేవలను ఒకే చోట అందించడానికి కేంద్ర ప్రభుత్వం ఎరువుల రిటైల్ షాపులను ప్రధానమంత్రి కిసాన్ సేవా కేంద్రాలుగా రేపటి నుంచి మార్చబోతున్నది.ఎరువుల కోసం ఒక దగ్గరికి, భూసార పరీక్షలకు ఒక దగ్గరకు.. ఇలా అనేక చోట్లకు వెళ్లాల్సి వస్తున్నది. అలా కాకుండా రేపటి నుంచి రైతులకు కావాల్సిన అన్ని రకాల సేవలు.. కిసాన్ సేవా కేంద్రాల్లో అందుబాటులో ఉంటాయి. నాణ్యమైన విత్తనాలు, ఎరువులు నిర్దేశిత ధరల్లో రైతులకు అందుబాటులో ఉంటాయి. భూసార పరీక్షలు, సీడ్ టెస్టింగ్ సౌకర్యాలు ఉంటాయి. కిసాన్ సేవా కేంద్రాలు రేపటి నుంచి అందుబాటులోకి వస్తాయి.

ఆధునిక వ్యవసాయ పద్ధతులు అప్గ్రేడేషన్, అవగాహన కిసాన్ కేంద్రాల ద్వారా కృషి చేస్తాం. రైతులకు సంబంధించిన కేంద్ర, రాష్ట్ర పథకాలపై ఈ కేంద్రాలు అవగాహన కల్పిస్తాయి. రెండు కోట్ల 80 లక్షల రిటైల్ షాపులను ప్రధానమంత్రి కిసాన్ సేవా కేంద్రాలుగా అప్గ్రేడే చేసే కార్యక్రమం కొనసాగుతున్నది.

రేపు ప్రధాని మోడీ గారు.. మొదటి దశలో లక్షా 25 వేల కిసాన్ సేవా కేంద్రాలను ప్రారంభించబోతున్నారు. 2014లో మోడీ గారు ప్రధాని అయిన తర్వాత నీమ్ కోటెడ్ యూరియా సరఫరా చేయడంతో యూరియా బ్లాక్ మార్కెట్ సమస్య పోయింది. నేల నాణ్యత పెరిగింది. రేపటి నంచి నీమ్కోటెడ్ యూరియాతోపాటు సల్ఫర్ కోటెడ్ యూరియా కూడా దేశమంతా రాబోతున్నది.14వ విడత పీఎం కిసాన్ సమ్మాన్ నిధులు కూడా రేపు ఉదయం ప్రధాని 8.5 కోట్ల రైతుల ఖాతాల్లోకి విడుదల చేస్తారు.

తెలంగాణలో సుమారు 39 లక్షల మంది రైతుల అకౌంట్లలో డబ్బులు పడనున్నాయి. ఫార్మర్ ప్రొడ్యూసర్స్ ఆర్గనైజేషన్స్(ఎఫ్పీవో)లను ఓపీడీసీ పరిధిలోకి తీసుకొచ్చి.. రైతుల ఉత్పత్తులకు మార్కెటింగ్ నెట్వర్క్ పెంచేందుకు రేపు ప్రధానిగారు కార్యాచరణ ప్రకటిస్తారు.ఒకప్పుడు యూరియా కోసం చెప్పులు క్యూలోపెట్టేవారు, లాఠీ చార్జీలు జరిగేవి. ప్రధాని మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎరువుల కొరత తీరింది.

ఒకే దేశం.. ఒకే ఎరువు అనే కాన్సెప్ట్ కింద.. భారత్ బ్రాండ్ పేరుతో రేపటి నుంచి ఎరువుల సరఫరా అమలులోకి రాబోతున్నది.కిసాన్ సేవా కేంద్రాల్లో అన్ని రకాల వ్యవసాయ పనిమొట్లు.. అమ్మకానికి అందుబాటులో పెట్టడం జరిగింది.డిస్టిక్ లెవెల్లో డీలర్ల వద్ద పురుగుమందులు పిచికారీ చేసే డ్రోన్లను అందుబాటులో పెట్టబోతున్నాం.

ఏ పంట వేయాలి? ఏ ఎరువు వాడాలనే దానిపై రైతులకు కిసాన్ సేవా కేంద్రాలు అవగాహన కల్పిస్తాయి.సీడ్ టెస్టింగ్తోపాటు, వ్యవసాయానికి ఉపయోగించే వాటర్ను కూడా టెస్టింగ్ కూడా దేశంలో మొదటిసారి రేపటి నుంచి అమల్లోకి తీసుకువస్తున్నాం.పంటల భీమా పథకం పట్ల బ్యాంకులను, రైతులను సమన్వయం చేసేందుకు అవగాహన కార్యక్రమాలు నడుస్తాయి.రైతుల ఇబ్బందులు, సమస్యలపై ఒకరికొకరు తెలుసుకునేందుకు ‘కిసాన్ కి బాత్’ రైతుల గ్రూప్ మీటింగ్ రేపటి నుంచి అమలు చేయబోతున్నాం. ప్రతి నెల రెండో అధివారం కిసాన్ కి బాత్ ఉంటుంది.

కిసాన్ సేవా కేంద్రం పరిధిలో ఉండే రైతులతో వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసి.. ఎప్పటికప్పుడు వాతావరణ, వ్యవసాయ, మార్కెట్ అప్డేట్లు అందులో పంపే కార్యక్రమానికి రేపటి నుంచి కేంద్రం అమల్లోకి తీసుకురానుంది.ప్రధాన మంత్రి సేవా కేంద్రాల్లో పనిచేసే సిబ్బందికి శిక్షణ ఉంటుంది. డిపార్ట్మెంట్ ఆఫ్ పర్టిలైజర్స్ ఆ బాధ్యత తీసుకుంటుంది.

ప్రపంచవ్యాప్తంగా ఎరువుల ధరలు విపరీతంగా పెరిగాయి.. కానీ మోడీ ప్రభుత్వం భారతదేశంలో గత అనేక సంవత్సరాలుగా ఎరువుల ధరలు పెంచకుండా రైతులకు అందిస్తున్నది.45 కిలోల యూరియా బస్తాను రైతుకు రూ.265కు ఇస్తున్నది. కానీ దాని అసలు ధర రూ. 2503 అంటే దాదాపు 2236 రూపాయలు కేంద్రం సబ్సిడీగా భరిస్తున్నది. 50 కిలోల డీఏపీ బస్తాకి 3771 రూపాయలు కాగా.. కేంద్రం రైతులకు రూ.1311 మాత్రమే ఇస్తున్నది. అంటే ప్రతి బ్యాగ్పై రూ.2400 కేంద్రం భరిస్తున్నది. అంటే సగటున ఒక ఎకరం సాగు చేసే రైతుకు కేంద్రం ఎరువులపైనే రూ.18 వేలకు పైగా లబ్ధి చేకూరుస్తున్నది. అన్నీ కలుపుకొని పదెకరాలు సాగు చేసే రైతుకు దాదాపు 2 లక్షల రూపాయల పరోక్ష సాయం చేస్తున్నది.

నానో యూరియాను కూడా ప్రధాని గారు ప్రారంభించనున్నారు. అమెరికాలో ఒక యూరియా బస్తాను రూ.3 వేలు చెల్లించి అక్కడి రైతు కొంటుంటే.. ఇండియాలో రైతు రూ.265కి కొంటున్నాడు. గత 9 ఏండ్లలో కనీస మద్దతు ధరను పెంచుతూ కేంద్రం రైతులను ఆదుకుంటున్నది. 2014లో వరికి రూ.1360 ఎంఎస్పీ ఉంటే.. ఈరోజు దాన్ని కేంద్రం రూ.2183కి(61 శాతం) పెంచింది.

పత్తి రూ.3750 ఉండేది.. ఇప్పుడు అది రూ.6620 చేసింది కేంద్రం.. రానున్న రోజుల్లో కేంద్ర ప్రభుత్వం రైతు సంక్షేమం అంకితభావంతో పనిచేస్తుంది.రేపు తెలంగాణలో సుమారు 4 వేల ఎరువుల రిటైల్ షాపులు.. ప్రధానమంత్రి కిసాన్ సేవా కేంద్రాలుగా అప్గ్రేడ్ కాబోతున్నాయి.. ఈ కార్యక్రమంలో రైతుల భాగస్వాములు కావాలి.శామీర్పేటలో జరిగే కార్యక్రమంలో నేను పాల్గొంటాను.

రాష్ట్రంలో కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐం ఒకే తాను మొక్కలే.. వీళ్లు గతంలో కలిసి పనిచేశారు.. భవిష్యత్తులో చేస్తారు. ఇందులో ఏ పార్టీకి వేసినా.. మూడు పార్టీలకు వేసినట్లే. బీజేపీ ఈ మూడు పార్టీలతో గతంలో కలవలేదు.. భవిష్యత్తులో కలవం. ఈ మూడు పార్టీలు ప్రత్యక్షంగా, పరోక్షంగా తెలంగాణను పరిపాలించాయి.. వాటిపై మా పోరాటం కొనసాగుతుంది.ఈ విషయం తెలంగాణ సమాజం అర్థం చేసుకోవాలి.

రాష్ట్రంలో మార్పు రావాలంటే.. తెలంగాణ ఉద్యమకారుల ఆకాంక్షలు నెరవేరాలంటే.. అవినీతి రహిత ప్రభుత్వం రావాలంటే.. అది మోడీ నాయకత్వంలోని బీజేపీతో మాత్రమే సాధ్యం. అందరూ ఈ విషయాన్ని గుర్తించాలి.

LEAVE A RESPONSE