Suryaa.co.in

Telangana

ఉత్సవాలు మాసికం లాగా జరుపుకుంటున్నారు

– రేవంత్ రెడ్డి పాలనలో మళ్లీ తుపాకీ రాజ్యం
– బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ 

రేవంత్ రెడ్డి పాలనలో మళ్లీ తుపాకీ రాజ్యం నడుస్తున్నది. బీఆర్ఎస్ నాయకుల మీద కక్షతో అక్రమ కేసులు పెడుతున్నది. సీఎం రేవంత్ రెడ్డి డైరెక్షన్లోనే ఇదంతా జరుగుతున్నది. ఎమ్మెల్యే ఫిర్యాదు చేసినా పట్టించుకోకుండా, ఉల్టా కేసు పెడతారా? మాజీ హోం మంత్రి కి కూడా కనీసం గౌరవం ఇవ్వడం లేదు. కాంగ్రెస్ పాలనలో ఏ పల్లెకు వెళ్లినా ఎవరూ సంతృప్తిగా లేరు. ప్రజా పాలనకు ఏడాది ఉత్సవాలు జరుపుకుంటున్నారు. కానీ, ప్రజలు మాత్రం ఏడాది మాసికం లాగా జరుపుకుంటున్నారు.

సమైక్య పాలనలో వేలాది మంది పోలీసుల మధ్య జైబోలో తెలంగాణ ఉద్యమించినం. కేసులు మాకు కొత్త కాదు, మేం ఎన్నడూ భయపడం, లక్ష కేసులు పెట్టినా మేం ఎదుర్కొంటం, తగిన గుణపాఠం చెబుతాం.

లగచర్లలో ఏం జరిగిందో నీకు తెలిసిపోయింది కదా? తెలంగాణ ప్రజలు మిమ్మల్ని అసహ్యించుకుంటున్నరు. సీఎం రేవంత్ రెడ్డీ ముందు నువ్వు ఆ ఫ్రస్టేషన్ నుంచి బయటకు రా. మా బీఆర్ఎస్ నాయకులందరినీ విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నాం.

LEAVE A RESPONSE