– పంచాయతీ రాజ్ శాఖ మంత్రి జిల్లాలోనే గ్రామలు అభివృద్ది చేసిన వారికి బిల్లులు చెల్లించపోతే ఇంకా రాష్ట్రంలో గ్రామాలను ఏమి అభివృద్ది చేస్తారు?
– అధికారులు నిబంధనల మేరకు చెల్లింపులు జరపాలి
– లేదంటే కోర్టు ధిక్కార చర్యలకు బాధ్యులు కావల్సి వస్తుంది
-మాజీ మంత్రి అమర్నాధ్ రెడ్డి
వై.సి.పి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత నరేగా బిల్లులు పూర్తిగా పెండింగ్ లో ఉంచారు. ఈ పనులు ఏదో కాంట్రాక్టర్లు చేసినవి కాదు. ఆ గ్రామాల అభివృద్దిని అకాంక్షిచే వారు చేసిన పనులు. ఇప్పటికి బిల్లుల చెల్లింపులు జరపకపోవడం వల్ల దాదాపు 50 మంది చనిపోయారు. చాల మంది ఆస్తులు అమ్ముకున్నారు. నిన్న అనంతపురం జిల్లా ఆత్మకూరు మండలం ముదిగుబ్బకు చెందిన నరసింహులు ఎం.పి.డి.వో ఆఫీసులో అధికారుల ముందే ఆత్మహత్యా యత్నం చేయాల్సిన పరిస్థితి నెలకొంది.
పనులు పూర్తన తరువాత క్వాలిటీ కంట్రోల్ పరీశీలన, సోషల్ ఆడిట్ పూర్తి అయ్యాయి. మోటిరియల్ సంబంధించి అధికారులు పూర్తి స్దాయి క్వాలీటీ తనీఖీ చేశారు.
అయినప్పటికి బిల్లులు ఆపడానికి కోర్టుకు సైతం తప్పుడు సమాచారం ఇస్తున్నారు. ఉపాధి హమీ చట్టంలోని నిబంధనలకు వ్యతిరేకంగా పని చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 12 వేల పనులను విజిలెన్స్ ఎంక్వెరీ పేరుతో కోతలు పెట్టారు. న్యాయస్దానం బిల్లుల చెల్లింపులు జరపండని ఆదేశాలు ఇచ్చిన తరువాత కూడా చెల్లింపులు జరపకుండా విజిలెన్స్ ఎంక్వెరీ పేరుతో జాప్యం చేస్తున్నారు.
రాప్తాడు, ఎర్రగుంటలో మల్లెపాడు, టి.వెంకటా పురం, హనుమాన్ గుత్తి, మరియు చిత్తూరు జిల్లాలో పంచాయతీ రాజ్ శాఖ మంత్రి సొంత జిల్లాలోనే శాదుంలో చెరుకువారి పల్లె, చౌడపల్లి మండలంలో గెడ్డంవారి పల్లి, పరికిదోన, వెంగంవారిపల్లి, కోండయ్యవారి పల్లి, దాదేపల్లి సహా పలు గ్రామాల్లో సైతం చెల్లింపులు జరపలేదు. గ్రామాల అభివృద్ధి చేసిన వారికి చెల్లింపులు జరపకపోతే రాష్ట్రంలోని మిగిలిన గ్రామాల అభివృద్ధికి ఎవరు ముందుకొస్తారు.? కోర్టు ఆదేశాలతో కొంత మేర నిధులు విడుదల చేసినా అవి పనులు చేసిన వారికి కాకుండా.. వై.సి.పి నాయకులు తమను కలిస్తే బిల్లులు చెల్లింపు జరుపుతాం అని చెప్పడం దుర్మార్గం. దీనిపై అధికారులను మేము కలిసినప్పుడు. అధికారులు కోర్టుకు వెళ్ళమని సూచించే పరిస్థితులు రాష్ట్రంలో నెలకొన్నాయి.
అధికారులు, రాజకీయ నాయకుల ఒత్తిడి మేరకు కాకుండా నిబంధనల మేరకు పనిచేయాలి. ప్రభుత్వాలు మారుతూ ఉంటాయి. కాని అధికారులు అలానే ఉంటారు. కోర్టు ఆదేశాల మేరకు అధికారులు పంచాయతీలలో జమ అయిన నరేగా పెండింగ్ బిల్లులు పనులు చేసిన వారికి చెల్లించేలా బాధ్యత తీసుకోవాలి. దీనిపై అధికారులు తగిన రీతిలో చర్యలు చేపట్టకపోతే కోర్టు ధిక్కార చర్యలు ఎదుర్కోవలసి వస్తుంది. దీనిని దృష్టిలో పెట్టుకుని అధికారులు నిబంధనల మేరకు పనిచేయాలి. ప్రభుత్వం కోర్టు ఆదేశాలను అనుసరించి నిధులు విడుదల చేయాలి.