Suryaa.co.in

Telangana

పిట్టల రవీందర్ ను తొలగించే వరకు పోరాటం

– తెలంగాణ ప్రదేశ్ గంగపుత్ర సంఘం

మత్స్య కార్పొరేషన్ చైర్మన్ పదవి నుంచి పిట్టల రవీందర్ ను తొలగించే వరకు తమ పోరాటం కొనసాగుతుందని తెలంగాణ ప్రదేశ్ గంగపుత్ర సంఘం హెచ్చరించింది. సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సంఘం నాయకులు తెలంగాణ ప్రభుత్వ తీరుపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. చేపల వృత్తిపై ఆధారపడి జీవించే గంగపుత్ర సామాజిక వర్గం పట్ల తీవ్ర వివక్ష ప్రదర్శిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

కేంద్రం నుంచి రావాల్సిన వేలకోట్లను దోచుకునేందుకే సీఎం కేసీఆర్ ఇతర వర్గాలను కార్పొరేషన్ లోకి ప్రవేశపెట్టారని మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనంతరం తమ జీవితాల్లో వెలుగులు నిండుతాయని భావించామని అందుకు విరుద్ధంగా ప్రస్తుత పాలకుల వ్యవహరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

వీటన్నింటి నేపథ్యంలో దశాబ్ది ఉత్సవాలలో భాగంగా జరగనున్న గంగమ్మ గుడి వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేస్తామని స్పష్టం చేశారు. కార్పొరేషన్ పదవి న్యాయబద్ధంగా గంగపుతులకు ఇవ్వాల్సి ఉండగా అన్యాయంగా ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తికి ఇచ్చారని ఆ పదవి నుంచి పిట్టల రవీందర్ ను దించే వరకు ఐక్యంగా పోరాడుతామని హెచ్చరించారు.

LEAVE A RESPONSE